‘తల్లికి వందనం’తో ఆనందం
ABN, Publish Date - Jun 14 , 2025 | 11:50 PM
‘తల్లికి వందనం’ అమలు తో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవని రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు.
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న సుబ్బారెడ్డి, విద్యార్థులు
డోన రూరల్, జూన 14 (ఆంధ్రజ్యోతి): ‘తల్లికి వందనం’ అమలు తో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేవని రాష్ట్ర సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన చైర్మన ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. శనివారం ఎంఎస్ ఆర్ కార్యాలయంలో విద్యార్థులతో కలిసి సీఎం చంద్రబాబు చిత్రపటా నికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లు ల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ కావడంతో సీఎంకు కృతజ్ఞత లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సీఎం శ్రీనివాసులు, గండికోట రామసుబ్బయ్య, లోకేశగౌడు, కోనేటి కాశీ విశ్వనాథ్, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Jun 14 , 2025 | 11:50 PM