ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం

ABN, Publish Date - May 18 , 2025 | 01:29 AM

స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం 24వ హనుమజ్జయంత్యుత్సవా లు ఘనంగా ప్రారంభమయ్యాయి.

హనుమాన్‌జంక్షన్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం 24వ హనుమజ్జయంత్యుత్సవా లు ఘనంగా ప్రారంభమయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సతీమణి రాధమ్మ ఉత్సవ పందిరికి రిబ్బన్‌ కట్‌చేసి ఉ త్సవాలను ప్రారంభించారు. అనంతరం హారతి ఇచ్చి కళావేదికను ప్రారంభించగా దాసాంజనేయ భజన సమాజం బృందం 108 పర్యాయాలు హనుమాన్‌ చాలీసా పారాయణం నిర్వహించారు. తొలుత తెల్లవారు జామున ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యుల స్వామికి సుప్రభాత సేవ, అర్చన, గోత్ర నామాలతో పూజలు జరిపారు. 1008 గులాబీలతో ప్రత్యేక పూజా నిర్వహించారు. మొదటి రోజు స్వామి అలంకరణకు కర్నాటక, సింథనూరుకు చెందిన కంకటా ల రామసుబ్బారావు, ఉమాదేవి దంపతులు పుష్ప వితరణ చేశారు. ఉత్సవాలు సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం భక్తులకు మజ్జిగ పంపిణీని రామాలయం వద్ద ఏర్పాటు చేసింది. ఈవో పీ తారకేశ్వరరావు పర్యవేక్షణలో కూటమి నేతలు వేమూరి శ్రీనివాసరావు, మట్టా శ్రీనివాసరావు, పావులూరి రామారావు, గారపాటి రామసీత, వడ్డి వాసవి, మూల్పూరి గోపీచంద్‌,గరికపాటి నాగేశ్వరరావు, పాబోలు ర మేశ్‌, కలిపిండి అప్పారావు, ఆర్యవైశ్య సంఘం నేతలు పైడి సుధాకర్‌, కొనకళ్ల రాజశేఖర్‌, పాబోలు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:29 AM