ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆగిన హంద్రీ విస్తరణ పనులు

ABN, Publish Date - May 30 , 2025 | 11:55 PM

కూటమి ప్రభుత్వం రూ.3,500 కోట్లతో హంద్రీ నీవా విస్తరణకు శ్రీకారం చుట్టింది.

: ప్యాకేజీ-1లో హంద్రీనీవా కాలువ 53.700 కి.మీల వద్ద పూడికతీత పనులు

అనుకోని వర్షాలతో ఆగిన పురోగతి..!

జూన 10లోగా పూర్తి చేయాలని లక్ష్యం.. పురోగతి 50 శాతంలోపే

పది రోజుల్లో పూర్తి చేయడం సాధ్యమేనా..?

కర్నూలు, మే 30 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రూ.3,500 కోట్లతో హంద్రీ నీవా విస్తరణకు శ్రీకారం చుట్టింది. నంద్యాల, కర్నూలు జిల్లాలలో బ్యాలెన్స పనులు రూ.690 కోట్లతో చేపట్టారు. జూన 10లోగా పూర్తి చేయాలని కాంట్రాక్ట్‌ సంస్థలకు ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించింది. అయితే.. అనుకోని ముందస్తు వర్షాల వల్ల పనులు ఆగిపోయాయి. కాల్వలో వర్షపునీరు చేరడంతో మట్టి, పూడికతీత పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు సగటున 49.072 శాతానికి మించి పనులు జగరలేదు. మిగిలన సమయం పది రోజులే. విస్తరణ పనులు పూర్తవుతాయా..? ఈ ఖరీఫ్‌లో 3,850 క్యూసెక్కులు కాలువకు మళ్లించడం సాధ్యమేనా..? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.

రాష్ట్ర విభజన తరువాత అప్పటి టీడీపీ ప్రభుత్వం రూ.1,030 కోట్లతో 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు చేపట్టింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆపేసింది. మళ్లీ సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకెళ్లాలనే ఆశయంతో హంద్రీనీవా విస్తరణ, సీసీ లైనింగ్‌ పనులు ప్రాధాన్యతగా చేపట్టారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో రూ.960 కోట్లలో బ్యాలెన్స విస్తరణ పనులు మొదలు పెట్టి జూన 10వ తేదిలోగా పూర్తి చేయాలని టార్గెట్‌ పెట్టారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వారం వారం పురోగతిపై వీడియో కాన్ఫరెన్స ద్వారా సమీస్తున్నారు.

జిల్లాలో ప్యాకేజీ-1 కింద రూ.260 కోట్లతో చేపట్టే 0/0 నుంచి 88 కిలోమీటర్ల వరకు విస్తరణ పనులు మెగా ఇనఫ్రా సంస్థ, ప్యాకేజీ-2 కింద రూ.430 కోట్లతో చేపట్టిన 88 కి.మీలు నుంచి 201 కిలో మీటర్లు వరకు విస్తరణ పనులు డీఎస్‌ఆర్‌-వీపీఆర్‌ సంస్థలు జాయింట్‌ వెంచర్‌గా దక్కించుకొని పనులు చేపట్టాయి. ప్యాకేజీ-1లో 37.79 లక్షల క్యూబిక్‌ మీటర్లు మట్టి పనులకు గాను 18.92 లక్షల క్యూబిక్‌ మీటర్లు మట్టి పనులు (50.084 శాతం) చేశారు. ప్యాకేజీ-2 పరిధిలో 36.45 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులకు గాను 17.52 లక్షల క్యూబిక్‌ మీటర్లు (48.06 శాతం) పనులు చేశారు. అంటే.. సగటున 49.072 శాతం పురోగతి సాధించారు. లక్ష్యం మేరకు జూన 10లోగా విస్తరణ పనులు చేయాలి. మిగిలిన సమయం కేవలం పది రోజులే. అయితే.. ఈ నెల 16 నుంచి 26వ తేది వరకు జిల్లాలో కురిసిన ముందస్తు వానలు వల్ల వర్షపు నీరు కాలువలో చేరింది. అంతేకాదు.. నల్లరేగడి నేలల్లో వాహనాలు వెళ్లలేని పరిస్థితి. దీంతో ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. దీంతో పురోగతి మందగించింది.

3,850 క్యూసెక్కులు తీసుకోవడం సాధ్యమా..?:

కర్ణాటక రాష్ట్రంలో కురిసిన ముందస్తు వర్షాలు కారణంగా ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో గేట్ల్లెత్తి దిగువ శ్రీశైలం డ్యాంకు 97,659 క్యూసెక్కులు విడుదల చేశారు. ఎగువన కర్ణాటకలో, మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు పడితే ముందే డ్యాం నిండవచ్చని సాగునీటి నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మల్యాల సహా వివిధ ఎత్తిపోతల పథకాల పంపులు ఆన చేసి హంద్రీ నీవాకు నీటిని తీసుకునే అవకాశం ఉంది. ఆలోగా విస్తరణ పనులు పూర్తయితే 3,850 క్యూసెక్కులు తీసుకోవచ్చు. ఒకటి రెండు కిలోమీటర్లు విస్తరణ పనులు ఆగిపోయినా ఈ ఏడాది కూడా రెండు వేల క్యూసెక్కులతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుంది. దీంతో పనులు చేసే కాంట్రాక్ట్‌ సంస్థలు, పర్యవేక్షించే ఇంజనీర్లు ప్రతిష్టాత్మంగా రేయింబవళ్లు పనులు చేస్తే తప్ప గడువులోగా పనులు పూర్తవ్వడం కష్టమని పలువురు పేర్కొంటున్నారు.

ఫ మట్టి పనులు పురోగతి వివరాలు. (లక్షల క్యూబిక్‌ మీటర్లల్లో):

----------------------------------------------------------

ప్యాకేజీ చేయాల్సింది చేసింది

-----------------------------------------------------------

ప్యాకేజీ-1 37.79 18.92

ప్యాకేజీ-2 36.45 17.52

-------------------------------------------------------------

మొత్తం 74.24 36.34

------------------------------------------------------------

ఫ వర్షం వల్ల పనులు ఆగినమాట నిజమే

- పాండురంగయ్య, ఎస్‌ఈ, హంద్రీనీవా ప్రాజెక్టు సర్కిల్‌-1, కర్నూలు:

హంద్రీనీవా కాలువ ద్వారా 3,850 క్యూసెక్కులు తీసుకోవడానికి వీలుగా విస్తరణ పనులు చేపట్టాం. రెండు ప్యాకేజీల్లో 74.24 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 36.34 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనులు చేశాం. జూన 16 నుంచి అనుకోకుండా ముందస్తు వర్షాలు రావడంతో పనులు ఆగిపోయిన మాట నిజమే. గడువులోగా పూర్తి చేస్తాం.

Updated Date - May 30 , 2025 | 11:55 PM