ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GV Reddy : 2029లోనూ మా సార్‌ సీఎం కావాలి!

ABN, Publish Date - Mar 02 , 2025 | 03:13 AM

ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ జీవీ రెడ్డి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు.

  • బడ్జెట్‌లో తక్కువ రెవెన్యూ లోటు శుభపరిణామం

  • చంద్రబాబుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను

  • రాష్ట్రాభివృద్ధికి ఆయనకు మద్దతుగా నిలవాలి

  • ‘ఎక్స్‌’లో ఫైబర్‌ నెట్‌ మాజీ చైర్మన్‌ జీవీ రెడ్డి

అమరావతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇటీవల పలు పరిణామాల నేపథ్యంలో రాజీనామా చేసిన ఫైబర్‌నెట్‌ మాజీ చైర్మన్‌ జీవీ రెడ్డి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. రూ.33 వేల కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతో రూ.3.22 లక్షల కోట్ల భారీ బడ్జెట్‌ను ప్రణాళికాబద్ధంగా రూపొందించడం శుభపరిణామమని అన్నారు. ఇదే సమయంలో సీఎం చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు నాయకత్వం పట్ల తనకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందని పేర్కొన్నారు. తక్కువ కాలంలోనే టీడీపీలో, ప్రభుత్వంలో గౌరవ ప్రదమైన బాధ్యతలు అప్పగించడం జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు మా సార్‌ చంద్రబాబుకు రుణపడి ఉంటాను. ఏపీ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం 2029లోనూ మా సార్‌ ముఖ్యమంత్రి కావాలి’ అని ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతి కోసం చంద్రబాబుకు మద్దతుగా నిలవడం అభివృద్ధి కోరుకునే ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత’ అని జీవీ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - Mar 02 , 2025 | 03:13 AM