పేగుల ఆరోగ్యం ఎంతో కీలకం
ABN, Publish Date - May 18 , 2025 | 11:04 PM
గుల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, పేగుల ఆరోగ్యం రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుందని ఏషియన ఇనస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ చైర్మన, పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అన్నారు.
గ్యాసో్ట్ర ఎంట్రాలజిస్టు డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి
కర్నూలు హాస్పిటల్, మే 18 (ఆంధ్రజ్యోతి): పేగుల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని, పేగుల ఆరోగ్యం రానున్న రోజుల్లో ఎంతో కీలకం కానుందని ఏషియన ఇనస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ర్టో ఎంట్రాలజీ చైర్మన, పద్మవిభూషణ్ డాక్టర్ దువ్వూరి నాగేశ్వరరెడ్డి అన్నారు. కర్నూలు ఇండియన మెడికల్ అసోసియేషన ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐఎంఏ భవనలో డా.కేబీ కృష్ణమోహన మెమోరియల్ స్మారక ఉపన్యాసంలో భాగంగా పేగుల ఆరోగ్యంపై ఆయన మాట్లాడారు. పేగుల్లో మంచి బ్యాక్టీరీయా వల్ల అనేక లాభాలు ఉన్నాయనీ, 99 లోపల బ్యాక్టీరియా చెడిపోతే హార్ట్, కిడ్నీ, బ్రెయిన దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పేగుల్లో చెడ్డ బ్యాక్టీరియా రావడానికి ప్రధానంగా మహిళలు సీజేరియన ఆపరేషన్లు చేయించుకోవడం తల్లులు పిల్లలకు 6 నెలల వరకు పాలు ఇవ్వకపోవడం, పిల్లలకు 6 నెలల వయస్సు వరకు పిల్లలు యాంటి బయాటిక్స్ వాడటం వంటి మూడు కారణాల వల్ల చెడు బ్యాక్టీరియాలు వస్తాయన్నారు.
40 శాతం పిల్లల్లో ప్యాటీ లివర్:
ఇటీవల హైదరాబాదులో చదివే స్కూల్ పిల్లల సర్వేలో 30 నుంచి 40 శాతం చెడ్డ బ్యాక్టీరియాతో పాటు ప్యాటీలివర్ ఉన్నట్లు గుర్తించినట్లు డాక్టర్ నాగేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దీని వల్ల పిల్లల్లో లివర్ చెడిపోయే ప్రమాదం ఉందన్నారు. ఫాస్ట్‌ఫుడ్‌లోని రసాయనాల వల్ల చెడు బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉందన్నారు. భవిష్యత్తులో స్టూల్ (మలం) సంబంధిత ఫీకల్ మైక్రో బయోట్రాన్స ప్లాంటు థెరపీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనీ, ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా స్టూల్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఎంఎఫ్‌టీ ద్వారా స్టూల్ చికిత్స రానున్నదని, కొత్తగా పిల్‌బాల్ ద్వారా ఎండోస్కోపి విధానం చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యవంతుల నుంచి సేకరించిన స్టూల్ నమూనాల నుంచి తీసిన గట్ మైక్రోబయోమ్స్‌ను ఉపయోగించి రోగులకు మార్పిడి చేసే జీర్ణ సంబంధిత వ్యాధులను నయం చేసే దిశగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. డయాబెటిక్‌లో టైప్-1 పిల్లల్లో, టైప్-2 పెద్దల్లో వస్తుందని, టైప్-3 ప్రాంక్రియాస్ చెడిపోవడం వల్ల వస్తుందన్నారు. ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు ఆ.రామచంద్ర నాయుడు, డా.ఎస్‌వీ రామ్మోహన రెడ్డి, గ్యాస్ర్టో ఎంట్రాలజిస్టులు డా.బి.శంకర్‌శర్మ, డాక్టర్ వీ.వెంకటరంగారెడద్డి, ఐఎంఏ కోశాధికారి డా.మాధవి శ్యామల, వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 11:04 PM