మార్గ‘దర్శకులు’
ABN, Publish Date - May 21 , 2025 | 11:27 PM
మార్గదర్శి బంగారు కుటుంబానికి ఓర్వకల్లు పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం బాటలు వేసింది. పొదుపులక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఐదు మార్గదర్శి బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నారు.
మేమున్నామంటున్నపొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం
ఐదు ‘మార్గదర్శి బంగారు కుటుంబాల’ దత్తత
పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కృషి
పొదుపు మహిళల స్ఫూర్తి ప్రశంసనీయం
ఓర్వకల్లు, మే 21 (ఆంధ్రజ్యోతి): మార్గదర్శి బంగారు కుటుంబానికి ఓర్వకల్లు పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం బాటలు వేసింది. పొదుపులక్ష్మి మండల సమాఖ్య ఆధ్వర్యంలో ఐదు మార్గదర్శి బంగారు కుటుంబాల దత్తత తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం ‘మార్గదర్శి బంగారు కుటుంబం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సంపన్న కుటుంబాలు అనగారిన వారికి మధ్య ప్రత్యక్ష సం బంధాన్ని సృష్టించడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సేవా మనస్తత్వంతో ఉన్న సంపన్న కుటుంబాలు పేద కుటుంబాలను దత్తత తీసుకోవడమే ప్రధాన లక్ష్యం.
ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి..
‘మార్గదర్శి బంగారు కుటుంబం’ కార్యక్రమంలో తమ సహకారం అందించేందుకు ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి మండల ఐక్య సంఘం ముందుకొచ్చింది. ఆ సమాఖ్య గౌరవ సలహాదారులు విజయభారతి ఆధ్వర్యంలో ఐదు కుటుంబాలను దత్తత తీసుకున్నారు. నన్నూరు గ్రామానికి చెందిన మౌలాబీకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు 17ఏళ్ల వయసులో ఫిట్స్‌రోగానికి చనిపోయాడు. భర్త గుండె బ్యాధితో, కుమార్తె ఫిట్స్‌తో బాధపడుతుంది. ఆమెకు నెలకు రూ.2వేలు వరకు మందులు ఖర్చు అవుతాయని, వాటిని కొనే స్థోమత లేదని కమిటీ సభ్యులకు వివరించారు. ఆ కుటుంబానికి మండల ఐక్యసంఘం నెలకు రూ.2వేల చొప్పున జీవితాంతం మందుల ఖర్చు భరిస్తామని, రూ.24వేల చెక్కును అందజేశారు.
బాలభారతి స్కూల్‌లో ఆయా పోస్టు
హుశేనాపురం గ్రామానికి చెందిన నుసుదుబి భర్తకు క్యాన్సర్ రాగా నలుగురు పిల్లలతో రోడ్డున పడ్డారు. గుర్తించిన మండల సమైఖ్య దత్తత తీసుకుని ఇద్దరు పిల్లలకు పదోతరగతి వరకు ఉచితంగా విద్య అంది స్తామని, ఆమెకు బాలభారతి స్కూల్‌లో ఆయా పోస్టు కల్పించారు.
చదివించే బాధత్య..
ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన చెట్లమల్లాపురం లక్ష్మిదేవి కొడుకు హత్యకు గురికాగా, కొడలు జైలులో ఉంది. తల్లిదండ్రులు లేక ముగ్గురు పిల్లలు అనాథలు మారి నాయనమ్మ వద్ద ఉంటున్నారు. వారికి రూ.50 వేల చెక్కును అందజేశారు. అలాగే చదివించే బాధ్యతను తీసుకున్నారు.
వైద్యం ఖర్చుల కోసం నెలకు రూ.3వేలు
హుశేనాపురం చెందిన భాగ్యలక్ష్మి భర్త అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం చనిపోయాడు. ఆమెకు ఇద్దరు కుమారులు. భాగ్యలక్ష్మి కూడా అనారోగ్యం బారిన పడింది. వైద్యం చేయించుకోవడానికి, పిల్లలను చదివించేందుకు ఇబ్బందులు పడుతుండేది. మండల సమాఖ్య ఇద్దరు పిల్లలకు ఇంజనీరింగ్ పూర్తయ్యేదాకా చదివిస్తామని, ఆమెకు నెలకు రూ.3వేలు వైద్యం కోసం ఇస్తామని చెక్కును అందజేశారు. అలాగే చింతలపల్లె గ్రామానికి చెందిన వృద్ధురాలి భర్త, కొడుకు చనిపోవడంతో ఆమె అనా రోగ్యంతో బాధపడుతూ తిండిలేని స్థితిలో ఉంది. ఆమెకు మందుల ఖర్చులు అందజేస్తామన్నారు. పొదుపులక్ష్మి మహిళల స్పూర్తి ప్రశంసనీ యమని బంగారు కుటుంబ సభ్యులు కొనియాడారు.
రుణపడి ఉంటా..
నా కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకునేందుకు ముందుకు వచ్చిన పొదుపులక్ష్మి సంఘానికి రుణపడి ఉంటా. రోడ్డున పడిన మా కుటుం బాన్ని ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తున్నారు.
నుసుదుబి, హుశేనాపురం
నా జీవితానికి భరోసా
నా జీవితానికి మండల సమాఖ్య గౌరవ సలహాదారులు విజయభారతి భరోసా ఇచ్చారు. సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో మార్గదర్శి బంగారు కుటుంబం ప్రవేశ పెట్టడం పేదల జీవితాల్లో వెలుగు నింపడమే.
మౌలాబీ, నన్నూరు
సీఎం చంద్రబాబే మాకు స్పూర్తి
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మాకు స్ఫూర్తి. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అత్యంత ఐదు నిరుపేద కుటుంబాలను ఎంపిక చేసుకుని వారిలో చీకటి నుంచి బయటకు తీసుకురావాలని ముం దుకు వెళ్తున్నాం. రాబోయే సంవత్సరంలో 1000 మంది కుటుంబాలను దత్తత తీసుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాం.
ఫ విజయభారతి, పొదుపు లక్ష్మి మండల సమాఖ్య గౌరవసలహాదారు
Updated Date - May 21 , 2025 | 11:27 PM