ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sriharikota: ప్రయోగ వేదికపై జీఎస్ఎల్వీ-ఎఫ్‌16

ABN, Publish Date - Jul 26 , 2025 | 04:44 AM

జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగ ఏర్పాట్లలో షార్‌లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఈనెల 30న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని...

  • 30న ‘నిసార్‌’ ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు

సూళ్లూరుపేట, జూలై 25(ఆంధ్రజ్యోతి): జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 ప్రయోగ ఏర్పాట్లలో షార్‌లో శాస్త్రవేత్తలు బిజీగా ఉన్నారు. ఈనెల 30న తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ థావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ప్రయోగించే ఈ రాకెట్‌ ద్వారా ‘నిసార్‌’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపనున్నారు. 2,392 కిలోల బరువుండే ఈ శాటిలైట్‌ను నాసా-ఇస్రో సంయుక్తంగా రూపొందించాయి. వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌)లో మూడు దశల అనుసంధాన పనులు పూర్తి చేసుకున్న జీఎ్‌సఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ను రెండో ప్రయోగ వేదికకు తరలించారు. అక్కడ రాకెట్‌కు శాస్త్రవేత్తలు శుక్రవారం అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించి, గ్లోబల్‌ తనిఖీలు చేసి పరీక్షలు నిర్వహించారు. ఆదివారం రిహార్సల్‌, ప్రీ కౌంట్‌డౌన్‌ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రయోగానికి సంబంధించిన మిషన్‌ సంసిద్ధత సమీక్షా సమావేశాన్ని సోమవారం నిర్వహించనున్నారు.

Updated Date - Jul 26 , 2025 | 04:46 AM