ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Agriculture : సాగు.. భళా

ABN, Publish Date - Feb 09 , 2025 | 05:58 AM

రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో సాధించిన వృద్ధి రేటు గత వైసీపీ పాలనలో రివర్స్‌ అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ గాడిన పడుతోంది.

  • వ్యవసాయ, అనుబంధ రంగాల్లో పుంజుకున్న వృద్ధి రేటు

  • 2023-24లో 3.49%.. 2024-25లో 15.86%

  • గతేడాది కన్నా గణనీయంగా పెరిగిన సాగు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి రేటు పరుగులు పెడుతోంది. గతేడాది కన్నా వ్యవసాయం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ ప్రభుత్వంలో సాధించిన వృద్ధి రేటు గత వైసీపీ పాలనలో రివర్స్‌ అయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్లీ గాడిన పడుతోంది. గత ప్రభుత్వం రైతులకు అరకొరగా పెట్టుబడి సాయం చేయడం మినహా అవసరమైన ప్రోత్సాహకం అందించలేదు. కేంద్ర ప్రాయోజిత పథకాలను వినియోగించకుండా, రైతులకు ఇతర రాయితీలు అందించకుండా చేతులెత్తేసింది. సూక్ష్మసేద్య పరికరాలు, యంత్ర పరికరాలు, రాయితీపై సూక్ష్మపోషకాలు, ఎరువులు, పురుగు మందుల వంటివి అందించలేకపోయింది. పైగా అతివృష్టి, అనావృష్టితో రైతులు నష్టపోయారు. దీంతో గత ఐదేళ్లలో సాగు రంగంలో వృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చాక రాయితీ పథకాలతో పాటు సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. వర్షాలు ఆశాజనకంగా కురవడంతో పంటలు బాగానే పండుతున్నాయి. తుఫాన్లు, అధిక వర్షాలకు నష్టపోయిన రైతులకు విపత్తు సాయం అందించింది. ఖరీఫ్‌ సీజన్‌ ఆశాజనకంగానే సాగింది. రబీలో సాధారణ సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా.. పంట ఉత్పత్తి తగ్గే పరిస్థితులు లేవంటున్నారు. సీఎం చంద్రబాబు సూచనలతో మంత్రి అచ్చెన్నాయుడు తరచూ సమీక్షలు నిర్వహించి, అధికారుల వెంట పడుతుండటంతో సాగు రంగంలో కొంత మెరుగుదల కనిపిస్తోంది.


తాజా గణాంకాల ప్రకారం వ్యవసాయం, ఉద్యానం, పశుసంవర్థకం, మత్స్య, ఆక్వా, అటవీ రంగాల్లో ప్రస్తుత ధరల ప్రకారం స్థూల విలువ జోడింపు(జీవీఏ) 2023-24లో రూ.4,48,382 కోట్లు ఉండగా, 2024-25లో ఇప్పటికే రూ.5,19,485 కోట్లు నమోదైంది. వృద్ధి రేటు 2023-24లో 3.49% ఉండగా, 2024-25లో 15.86% నమోదైంది. గత పదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వృద్ధి నమోదైనా.. గత ఐదేళ్లలో తగ్గింది. ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోంది. 2014-15లో 14.92% ఉండగా, 2015-16లో 16.85%, 2016-17లో 21.77% 2017-18లో 22.80%, 2018-19లో 6.72%, 2019-20లో 12.36%, 2020-21లో 10.33%, 2021-22లో 13.92%, 2022-23లో 11.01, 2023-24లో 3.49%, 2024-25లో 15.86% వృద్ధిరేటు నమోదైంది. ఈ ఏడాది వృద్ధి రేటు మరింత పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 30 శాతం వృద్ధిరేటు సాధించాలని సంబంధిత అధికారులకు సీఎం నిర్దేశించారు.

Updated Date - Feb 09 , 2025 | 05:59 AM