Minister Satyakumar: ఆయుష్‌లో 358 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్
ABN, Publish Date - Jul 26 , 2025 | 03:36 AM
త ప్రభుత్వ వైఖరికి భిన్నంగా రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు.
71 మంది వైద్యులు, 26 మంది మేనేజర్లు
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు
అమరావతి, జూలై 25(ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ వైఖరికి భిన్నంగా రాష్ట్రంలో ఆయుష్ సేవలను విస్తృతం చేయడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సత్యకుమార్ అన్నారు. ఇందులో భాగంగా ఈ విభాగంలో 71 మంది డాక్టర్లు, 26 మంది జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్లు, 90 మంది పంచకర్మ థెరపిస్టులు, ముగ్గురు సైకాలజిస్టులతో కలిపి మొత్తం 358 మందిని సత్వరమే నియమించడానికి శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ‘గత ప్రభుత్వం ఐదేళ్లలో ఆయుష్ సేవలపై కేవలం రూ.37 కోట్లే ఖర్చు చేసింది. నేను వ్యక్తిగతంగా కేంద్రానికి విన్నవించడంతో 2024-25 ఏడాదికి కేంద్ర రూ. 83 కోట్లు మంజూరు చేసింది. 2025-26 ఏడాదికి రాష్ట్రంలో ఆయుష్ మిషన్ కింద రూ.250 కోట్ల మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాం. సిబ్బందిని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేస్తారు’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
కస్టమర్ల ఖాతాల నుంచి కోట్ల రూపాయల దోపిడీ.. పరారీలో ఎస్‌బీఐ క్లర్క్
పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..
For More Andhrapradesh News And Telugu News
Updated Date - Jul 26 , 2025 | 03:37 AM