ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Nellore: వైభవంగా గంధ మహోత్సవం

ABN, Publish Date - Jul 08 , 2025 | 07:04 AM

నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి తర్వాత వేడుకగా జరిగింది.

  • భక్తులతో కిటకిటలాడిన బారాషహీద్‌ దర్గా

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 7(ఆంధ్రజ్యోతి): నెల్లూరులోని బారాషహీద్‌ దర్గా ప్రాంగణంలో జరుగుతున్న రొట్టెల పండుగలో ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం సోమవారం అర్ధరాత్రి తర్వాత వేడుకగా జరిగింది. నగరంలో కోటమిట్ట అమిమియా మసీదు నుంచి 12 బిందెలతో గంధాన్ని మేళతాళాలు, ఫకీర్ల షరబ్‌లు ఊరేగింపుగా దర్గాకు చేరింది. పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య కడప పెద్ద మసీదు పీఠాధిపతులు ఆరీ్‌ఫవుల్లా బృందం, బారాషహీదులకు పూజలు చేసి గంధం ఎక్కించారు. ఈ కార్యక్రమంలో భక్త సుగంధాన్ని ప్రసాదంగా అందుకునేందుకు భక్తుల ఎగపడ్డారు. ఇక పండుగలో రెండో రోజు సోమవారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బారాషహీదులను దర్శించుకుంటున్నారు. స్వర్ణాల ఽఘాట్‌లో కోర్కె లు తీర్చే వరాల రొట్టెలను భక్తులు ఇచ్చిపుచ్చుకున్నారు. విద్య, ఉద్యోగం, ప్రమోషన్‌, సంతానం, గృహం, ఆరోగ్యం, వంటి రొట్టెలు కోసం భక్తులు ఎగబడ్డారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ సోమవారం సాయంత్రం బారాషహీద్‌ దర్గాను దర్శించుకుని, ఆరోగ్య రొట్టెను అందుకున్నారు.

Updated Date - Jul 08 , 2025 | 07:05 AM