ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి

ABN, Publish Date - Jun 02 , 2025 | 11:12 PM

రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్య మని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు శ్రీనివాసులు, బాలరాజు అన్నారు.

మాట్లాడుతున్న కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త శ్రీనివాసులు

చాగలమర్రి, జూన 2 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్య మని కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు శ్రీనివాసులు, బాలరాజు అన్నారు. సోమవారం మండలంలోని ముత్యాలపాడు, కేపీ తండా, పెద్దవంగలి గ్రా మాల్లో కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వికసి త కృషి సంకల్ప అభియాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయ ఖ ర్చులు తగ్గించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఎరువులు, పురుగు మందు లు ఏ సమయంలో వాడితే మంచి దిగుబడులు వస్తాయన్న విషయాలను రైతులకు వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ జిల్లా వనరుల కేంద్రం ఉప సంచాలకులు చెన్నయ్య, ఏవో ప్రభావతమ్మ, పశువైద్యాధికారులు సాయిబాబా, దీపకుమారి, ఏటీఎంఏ హరిబాబు, ఏపీసీఎనఎఫ్‌ నరేష్‌, ప్రకృతి వ్యవసాయ ఇనచార్జి నాగేశ్వర్‌రెడ్డి, వ్యవసాయ సిబ్బంది, నవీనకు మార్‌రెడ్డి, ఉమా, జయకృష్ణ, సర్పంచలు, రైతులు పాల్గొన్నారు.

పంట సాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలి

ప్యాపిలి: పంటల సాగులో పెట్టుబడులు తగ్గించుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని జలదుర్గం, హుసేనాపురం గ్రామాల్లో వికసిత కృషి సంకల్ప అభియాన కార్యక్రమం ద్వారా పంటల సాగుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. శాస్త్రవేత్త మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన సమీపిస్తున్నందున పంటల సాగుపై అప్రమతంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో అధికారులు వెంకటరెడ్డి, రాజేష్‌, కళ్యాణి, రైతులు, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:12 PM