ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gorantla Madhav News: రెండో రోజూ సహకరించని మాధవ్‌

ABN, Publish Date - Apr 25 , 2025 | 04:09 AM

చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై దాడి యాదృచ్ఛికంగా జరిగిందని, ఎటువంటి కుట్ర లేదని గోరంట్ల మాధవ్‌ విచారణలో తెలిపారు. విచారణలో పూర్తిగా సహకరించకపోవడంతో, ఆయనపై 14 రోజుల రిమాండ్ విధించారు.

జగన్‌ భార్యను తిట్టారన్న కోపంతోనే చేబ్రోలు కిరణ్‌పై దాడికి యత్నం

ఆయన్ను తీసుకెళ్తున్న వాహనం యాదృచ్ఛికంగానే కంటబడింది: మాజీ ఎంపీ

ముగిసిన రెండ్రోజుల కస్టడీ

తిరిగి కోర్టు ముందు హాజరు

రిమాండ్‌పై రాజమండ్రి జైలుకు తరలింపు

గుంటూరు, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్‌కుమార్‌పై దాడికి యాదృచ్ఛికంగానే ప్రయత్నించామని.. ఇందులో ఎటువంటి కుట్ర.. ముందస్తు పఽథకం లేవని మాజీ ఎంపీ, వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ఆయన రెండో రోజు కూడా విచారణకు సహకరించలేదని కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు. రెండ్రోజుల కస్టడీలో భాగంగా బుధ, గురువారాల్లో ఆయన్ను వారు విచారించారు. బుధవారం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి గుంటూరు తీసుకొచ్చి విచారణ చేపట్టేటప్పటికి రాత్రి అయింది. పూర్తిస్థాయిలో విచారించే అవకాశం లభించలేదు. దీంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 వరకు నల్లపాడు పోలీసు స్టేషన్లో వెస్ట్‌ డీఎస్పీ అరవింద్‌, నగరంపాలెం సీఐ నజీర్‌ ప్రశ్నించారు. ‘పోలీసుల అదుపులో ఉన్న కిరణ్‌కుమార్‌పై దాడికి యత్నించడం, ఎస్పీ కార్యాలయంలోనూ దాడికి పాల్పడడం నేరం. అసలు కిరణ్‌ను గుంటూరుకు తరలిస్తున్నారని ముందస్తు సమాచారం మీకెవరు ఇచ్చారు.? వైసీపీ నాయకులా.. పోలీసులా.. లేదంటే మీడియా ప్రతినిధులా..’ అని అడుగగా.. తనకెవరూ చెప్పలేదని ఆయన అన్నట్లు సమాచారం. దాడికి పురిగొల్పింది ఎవరు.. వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరని అడుగగా.. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని అనుచరులతో కలిసి వస్తుండగా కిరణ్‌ను తరలిస్తున్న పోలీసు వాహనం యాదృచ్ఛికంగానే కంటబడిందని... జగన్‌ సతీమణి భారతి పట్ల అనుచితంగా మాట్లాడిన నేపథ్యంలో కిరణ్‌కుమార్‌పై కోపంతో దాడికి ప్రయత్నించామని మాఽధవ్‌ చెప్పినట్లు తెలిసింది. వాహనం కనిపించగానే దాడికి ప్రయత్నించారంటే పథకం ప్రకారమే జరిగిందని పోలీసులు అనగా.. ఆయన దాటవేసినట్లు సమాచారం. విచారణ తర్వాత పోలీసులు ఆయనకు జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టు ముందు హాజరుపరిచారు. 14 రోజులపాటు రిమాండ్‌ విధిస్తూ మేజిస్ట్రేట్‌ స్రవంతి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన్ను బందోబస్తు మధ్య రాజమండ్రి తరలించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 25 , 2025 | 04:09 AM