సీఎం చంద్రబాబుతోనే సుపరిపాలన
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:06 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన సాధ్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అ న్నారు.
డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి
బేతంచెర్ల, జూలై 7 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడుతోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజలకు సుపరిపాలన సాధ్యమని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అ న్నారు. సోమవారం మండలంలోని హెచ.కొట్టాల, కొమ్మరి కొట్టాల, గోర్లగుట్ట గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే కోట్ల దంపతులు పాల్గొన్నారు. అనంతరం ప్రజలకు కరపత్రా లు పంపిణీ చేశారు. హెచ.కొట్టాల గ్రామంలో టీడీపీ నాయకులు, ప్రజలు కోట్ల దంపతులకు స్వాగతం పలికి భారీ గజమాలతో సత్క రించారు. అనంతరం ఆంజనేయస్వామి ఆలయంలో కోట్ల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య, టీడీపీ సీనియర్ నాయకులు పోలూరు రాఘవరెడ్డి, తిరుమ లేష్ చౌదరి, మండల సమన్వయ చైర్మన చంద్రశేఖర్, సుధాకర్, వెం కటేశ్వరరెడ్డి, టీడీపీ మాజీ ఎంపీపీ సోమశేఖర్ రెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, నాయకులు ఎండూరి మహేస్, కోమల యోగేంద్రబాబు, రఘు, కుల్లోతమ్మరావు, వెంగన్న, శ్రీరాములు, మద్దిలేటి పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
నాపరాళ్ల ఫ్యాక్టరీల యజమానుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో నాపరాళ్ల ఫ్యాక్టరీ యజమా నులతో సమావేశం నిర్వహించారు. ఓనర్స్ అసోసియేషన గౌరవాధ్య క్షుడు గౌరీ హుశేన రెడ్డి మాట్లాడుతూ సమస్యలు విన్నవించారు. ఎ మ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఫ్యాక్టర్ల యజమానులం దరూ కలిసి వస్తే సమస్యల పరిష్కారానికి ముందుంటానన్నారు.
వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో వినతి
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని వీఆర్‌ఏల సంఘం జిల్లా అధ్యక్షుడు నగేష్ కోరారు. సోమవారం డోన ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో మండలంలోని వీఆర్‌ఏలు పాల్గొన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:06 AM