ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijayawada Durga Temple: దుర్గమ్మ కానుకలు బ్యాంకులో డిపాజిట్‌

ABN, Publish Date - Jul 08 , 2025 | 04:38 AM

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు నగలను సోమవారం దుర్గామల్లేశ్వర దేవస్థానం అధికారులు విజయవాడ గాంధీనగర్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో డిపాజిట్‌ చేశారు.

  • 29.5 కిలోల బంగారు ఆభరణాలు.. విలువ రూ.26.58 కోట్లు

విజయవాడ(ఇంద్రకీలాద్రి), జూలై 7 (ఆంధ్రజ్యోతి): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారికి భక్తులు సమర్పించిన బంగారు నగలను సోమవారం దుర్గామల్లేశ్వర దేవస్థానం అధికారులు విజయవాడ గాంధీనగర్‌లోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖలో డిపాజిట్‌ చేశారు. చాలా కాలంగా స్ర్టాంగ్‌ రూమ్‌లో భద్రపరచిన వివిధ రకాల నగలను గోల్డ్‌ మేనిటైజేషన్‌ స్కీమ్‌ కింద 0.60 శాతం వడ్డీపై డిపాజిట్‌ చేశారు. ఇవి 22 క్యారెట్ల బంగారు నగలు. మొత్తం 29 కిలోల 510 గ్రాముల బరువు ఉన్నాయి. గ్రాము రూ.9,010 రేటు చొప్పున మొత్తం విలువ రూ.26 కోట్ల 58 లక్షల 85 వేలుగా అంచనా వేశారు. సోమవారం నాటి బంగారం ధరలను ఇంటర్‌నెట్‌లో పరిశీలించి ఆ మేరకు విలువ కట్టి బ్యాంకుకు అప్పగించినట్టు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ ఈవో శీనానాయక్‌, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ పల్లంరాజు, విజయవాడ దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కార్యాలయ పర్యవేక్షకుడు సుబ్రహ్మణ్యం తదితరుల పర్యవేక్షణలో పకడ్బందీ భద్రతా ఏర్పాట్ల నడుమ బ్యాంకులో నగలను అప్పగించారు.

Updated Date - Jul 08 , 2025 | 04:39 AM