Public Gambling Exposure: పబ్లిక్‌గా పేకాట
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:34 AM
వెలమవారిపాలెం...ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని చిన్నగ్రామం ఇది. ఇప్పుడీ ఊరి పేరు తెలుగునాట మారుమోగిపోతోంది. మంచిగా అయితే ఫరవాలేదుగానీ, మొత్తం రాష్ట్రాన్నే అప్రతిష్ఠపాల్జేసేలా ఈ ఊరే ఒక పేకాట క్లబ్‌గా మారిపోయింది.
మందు, విందులతో జూదగాళ్ల జోరు
రేపల్లెలోని చిన్నగ్రామం వెలమవారిపాలెం
రెవెన్యూ మంత్రి ఇలాకాలో బరితెగింపు
ఆరుబయటే షెడ్లు వేసి రాత్రంతా జూదం
నాన్ వెజ్ వంటకాలు.. తాగినంత మద్యం
ఫైవ్‌స్టార్ హోటల్‌కు మించిన విలాసం
జూదగృహాలకు తెలంగాణ నుంచీ రాక
నలభై మంది సొంత బలగంతో కాపలా
పోలీసుల ప్రేక్షక పాత్ర.. దీంతో మరింత జోష్
అప్పుఫు... ఇప్పుడు...
వైసీపీ హయాంలోనూ రేపల్లె ప్రాంతం జూద కేంద్రంగా వర్ధిల్లింది. అప్పట్లో క్లబ్బులను మూసివేయడంతో... జూదరులంతా రేపల్లెకు తరలి వచ్చేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇదే జోరు కొనసాగుతోందని వెలమవారిపాలెం వాసులు ఆవేదన చెందుతున్నారు. పేకాట జరిగే చోటుకే కాదు... సమీపానికి కూడా ఇతరులెవరూ వెళ్లలేనంత కట్టు దిట్టంగా దీనిని నడుపుతున్నారు.
(గుంటూరు - ఆంధ్రజ్యోతి)
వెలమవారిపాలెం...ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలోని చిన్నగ్రామం ఇది. ఇప్పుడీ ఊరి పేరు తెలుగునాట మారుమోగిపోతోంది. మంచిగా అయితే ఫరవాలేదుగానీ, మొత్తం రాష్ట్రాన్నే అప్రతిష్ఠపాల్జేసేలా ఈ ఊరే ఒక పేకాట క్లబ్‌గా మారిపోయింది. నాన్ వెజ్ వంటకాలతో విందు, తాగినవాళ్లకు తాగినంత మందు అందిస్తూ జూదరులను ఫైవ్‌స్టార్ హోటల్‌కు మించిన సౌకర్యాలతో ఉత్సాహపరుస్తున్నారు. పేకాటరాయుళ్ల చేతుల్లోని పేకలు రూ.కోట్లను కొల్లగొడుతున్నాయి. సాయంత్రం ఐదు గంటలు దాటిందంటే ఈ గ్రామంలో సందడి మొదలవుతోంది. ఆరుబయటే పెద్దపెద్ద షెడ్లు వేశారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచీ ఇక్కడ పేక ఆడటానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. పేకాట రాయుళ్లకు ఏమాత్రం అసౌకర్యం కలగకుండా చుట్టూ బౌన్సర్లను పెట్టి నిరంతరం కాపలా కాస్తుంటారు. ఒక్కో కాపలాదారుకు రోజుకు రూ. 1,200 చొప్పున భత్యం చెల్లిస్తూ షెడ్లు చుట్టూ పటిష్టమైన రక్షణ వలయాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్నారు. పోలీసులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. దీంతో జూదరులు పబ్లిక్‌గా ఆడుతున్నారు. ఒక వేళ తనిఖీలు చేసినా అవి ఉత్తుత్తి తనిఖీలే తప్ప అసలు నిర్వాహకులను, ఆటగాళ్లను మాత్రం టచ్ చేయడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
కాయిన్ల సిస్టమ్..: భీమవరానికి చెందిన వ్యక్తి వెలమావారిపాలేన్ని పేకాట అడ్డాగా మార్చినట్టు చెబుతున్నారు. ప్రతిరోజూ రూ.కోట్లలో నగదు చేతులు మారుతున్నట్లు అంచనా. పేకాట ఆడేవారు రూ.5 వేలు, 10వేలు, 20వేలు విలువ చేసే కాయిన్లు కొనుగోలు చేసి వాటితో తమకు నచ్చినవిధంగా జూదం ఆడుకోవచ్చు. క్షణా ల్లో తలరాతలు మార్చేసే కోతముక్క ఇక్కడ బాగా ఫేమస్. సాయంత్రం నాలుగు గంటల నుంచి తెల్లవారుజామువరకూ జూదం సాగిస్తున్నారు. రాత్రంతా పేకాట జరుగుతున్నా పోలీసులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడటంలేదని స్థానికులు వాపోతున్నారు.
Updated Date - Jul 08 , 2025 | 04:35 AM