ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జనరల్‌ ఫండ్‌ నుంచి పట్టణాభివృద్ధికి నిధులు

ABN, Publish Date - Apr 26 , 2025 | 12:57 AM

పురపాలక సంఘం జనరల్‌ ఫండ్‌ నుంచి ఇక పట్టాణాభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేసుకునే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయడం మంచి పరిణామమని, దీంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వీజీఏ దయాసాగర్‌ అన్నారు.

ఫ టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌

ఫ వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మించండి : వైసీపీ కౌన్సిలర్లు

ఫ పహల్గాం మృతులకు కౌన్సిల్‌ నివాళి

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌ 25(ఆంధ్రజ్యోతి): పురపాలక సంఘం జనరల్‌ ఫండ్‌ నుంచి ఇక పట్టాణాభివృద్ధికి నేరుగా నిధులు విడుదల చేసుకునే విధంగా ప్రభుత్వం జీఓ విడుదల చేయడం మంచి పరిణామమని, దీంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ వీజీఏ దయాసాగర్‌ అన్నారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన డాక్టర్‌ రఘు అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా ఇటీవల కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు కౌన్సిల్‌ సభ్యులు రెండునిమిషాలు మౌనం పాటించి నివాళి అర్పించారు. అనంతరం ఫ్లోర్‌ లీడర్‌ దయాసాగర్‌ మాట్లాడుతూ గతంలో జనరల్‌ ఫండ్‌ నేరుగా వాడుకునే అవకాశం ఉండేది కాదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మున్సిపాలిటీలే జనరల్‌ ఫండ్‌ నిధులను పట్టణాభివృద్ధికి వాడుకునే విధంగా జీవో విడుల చేసిందన్నారు. ఎమ్మిగనూరుకు ప్రతిఏడాది రూ.12కోట్ల ఆదాయం వస్తుందని ఆ నిధులను వినియోగించి పట్టణా న్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. అలాగే 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 12 కోట్లు ఉన్నాయని వీటిని కూడా ఏడాదిలోపు వినియోగించుకోవచ్చాన్నారు. ఇక పట్టణానికి ఈ వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఆదేశాలతో మున్సిపల్‌ అధికారులు చర్యలు తీసుకున్నారన్నారు. అనంతరం వైసీపీ కౌన్సిలర్లు అంపమ్మ, కేశవరెడ్డి, శివప్రసాద్‌లు మాట్లాడుతూ తమ వార్డుల్లో సీసీ రోడ్లు వేయాలని కోరుతున్న పట్టించుకోవటం లేదని ఆరోపించారు. ప్రధానంగా గాంధీనగ్‌లోని వైష్ణవి కాలేజి వెనుక తాగు నీరు సరిగా రావటం లేదని, దీంతో కాలనీవాసులు ఇబ్బందులు పడు తున్నారన్నారని అధికారుల దృష్టికి తీసుకవచ్చారు. కుర్ణి శ్మశాన వాటి కకు రోడ్డు ఏర్పాటు చేయాలని, ప్రహరీ నిర్మించాలని శివప్రసాద్‌ కోరా రు. కమిషనర్‌ గంగిరెడ్డి స్పందిస్తూ ఆస్తిపన్ను వసూళ్లలో జిల్లాలో ప్ర థమస్థానంలో ఉన్నామన్నారు. ఇక వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీటి సమ స్యలేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అజెండాలో ప్రవేశపెట్టిన 36 అంశాలను సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2025 | 12:57 AM