రేపటి నుంచి శ్రీశైలంలో ఉచిత స్పర్శ దర్శనం నిలుపుదల
ABN, Publish Date - Jul 13 , 2025 | 11:47 PM
శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
నంద్యాల ఎడ్యుకేషన, జూలై 13 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత స్పర్శ దర్శనం రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈవో మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగిన దృష్ట్యా మంగళవారం నుంచి 18వ తేదీ వరకు మధ్యాహ్న వేళలో కల్పించే ఉచిత స్పర్శ దర్శనం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. సర్వ దర్శనం క్యూలైనలలోని భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు తెలిపారు. భక్తులు మార్పును గమనించి సహకరించాలని కోరారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Updated Date - Jul 13 , 2025 | 11:47 PM