ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జీరో ఫేర్‌ టికెట్‌

ABN, Publish Date - Jul 22 , 2025 | 05:34 AM

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. వంద శాతం ప్రభుత్వ రాయితీతో మహిళలకు జీరో ఫేర్‌ టికెట్‌ ఇవ్వాలని...

  • మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు

  • ఆర్టీసీ బస్సుల్లో 100శాతం ప్రభుత్వ రాయితీ

  • అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

  • విద్యుత్‌ బస్సులు, చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. వంద శాతం ప్రభుత్వ రాయితీతో మహిళలకు ‘జీరో ఫేర్‌ టికెట్‌’ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలుపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి మహిళా ప్రయాణికురాలికి జీరో ఫేర్‌ టికెట్‌ ఇస్తే ఎంత ఖర్చు ప్రభుత్వంపై పడుతుందో, ఆమె ఎంత లబ్ధి పొందుతారో తెలుస్తుందన్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ సిద్ధం చేయాలని ఆదేశించారు. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న పొరుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పంజాబ్‌ లాంటి చోట్ల ఎంత మేరకు ఖర్చు అవుతోందనే విషయంపై అధికారులతో సీఎం చర్చించారు. నిర్వహణ వ్యయం తగ్గించుకుని, లాభాల కోసం మార్గాలను అన్వేషించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులకు సూచించారు. ఆర్టీసీ ఇకపై ఏసీ ఎలక్ర్టిక్‌ బస్సులు మాత్రమే సమకూర్చుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న బస్సులను ఎలక్ట్రిక్‌ బస్సులుగా మారిస్తే నిర్వహణ భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. ఈ బస్సులకు అవసరమయ్యే విద్యుత్‌ను సొంతంగా ఉత్పత్తి చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు కోసం అధ్యయనం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ప్రయాణికుల సంఖ్య పెరగొచ్చు

ప్రస్తుతం రాష్ట్రంలో పల్లె వెలుగు, సిటీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రోజూ 16.11 లక్షల మంది మహిళా ప్రయాణికులు గమ్యం చేరుతున్నారు. ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం అమలు చేస్తే ఉమ్మడి జిల్లాల్లో తిరిగే బస్సులతో పాటు విశాఖపట్నం, విజయవాడ సిటీ సర్వీసుల్లో 27 లక్షల మంది వరకూ ప్రయాణించే అవకాశం ఉన్నట్లు ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉచిత ప్రయాణం ద్వారా ఏపీఎ్‌సఆర్టీసీపై ప్రతి నెలా 245 కోట్ల రూపాయల వరకూ భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదించారు. బస్టాండ్లలో వసతులు, మరుగుదొడ్ల మరమ్మతులు, అదనపు సిబ్బంది, అదనపు బస్సుల గురించి అందులో వివరించారు.

Updated Date - Jul 22 , 2025 | 05:36 AM