ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు 2 రోజుల పోలీసు కస్టడీ

ABN, Publish Date - Apr 22 , 2025 | 05:29 AM

టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో వైసీపీ నేత గోరంట్ల మాధవ్‌ను ఈ నెల 23, 24 తేదీల్లో రెండు రోజులు పోలీసు కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులపై దాడి చేసిన ఘటనకు సంబంధించి మాధవ్‌తో పాటు అతని అనుచరులపై కేసు నమోదైంది.

రేపు, ఎల్లుండి విచారణకు కోర్టు ఆదేశాలు

గుంటూరు, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకుడు, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు రెండ్రోజులు పోలీసు కస్టడీకి అనుమతించింది. ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్‌లో ఉన్న ఆయన్ను ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన మేజిస్ట్రేట్‌ జి.స్రవంతి.. బుధ, గురువారాల్లో (ఈ నెల 23, 24 తేదీల్లో) రెండ్రోజులు కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు. గోరంట్ల మాధవ్‌ ఇటీవల గుంటూరులో పోలీసు కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌ కుమార్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల పైనా దాడి చేశారు. అంతేకాకుండా పోలీసు వాహనాలను వెంబడించి.. జిల్లా పోలీసు కార్యాలయంలోనూ పోలీసులపై దౌర్జన్యం చేశారు. దీనిపై పోలీసు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులైన అనంతపురం జిల్లాకు చెందిన చిగండి రమేశ్‌, తాళ్ల దామోదర్‌, దిగివెంటి శివప్రసాద్‌, చిదగొండ్ల శివయ్య, గౌండ్ల సురేందర్‌ తదితరులను అరెస్టు చేసి ఈ నెల 11న కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్‌ రిమాండ్‌ విధించడంతో రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Post Office: ఏమిటి.. ఇన్నీ మంచి పథకాలా..

10th Class Result: 10వ తరగతి పరీక్ష ఫలితాలు.. విడుదల ఎప్పుడంటే..

Business: ఈ పథకంలో జస్ట్ రూ. 45 పెట్టుబడిగా పెట్టండి.. రూ. 25 లక్షలు మీ సొంతం

Rs 500 Notes: రూ. 500 నోట్లపై కీలక అప్ డేట్: కేంద్రం వార్నింగ్

Pope Francis: పోప్ ఫ్రాన్సిస్ మృతి.. స్పందించిన ప్రధాని మోదీ

వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ (21-04-2025) సోమవారం మృతి చెందారు.

RVNL: దేశంలోనే తొలిసారి... అతిపొడవైన 14.57 కి.మీ.సొరంగం పూర్తి

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 22 , 2025 | 05:30 AM