ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TDP Office Attack: కుట్రలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్లకూ పాత్ర

ABN, Publish Date - May 28 , 2025 | 06:03 AM

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికుట్రలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు తేలడంతో ఆయనను 127వ నిందితుడిగా సీఐడీ చేర్చింది. ఇప్పటికే సజ్జల, లేళ్ల అప్పిరెడ్డి తదితరులు నిందితులుగా ఉన్న ఈ కేసులో, తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 127వ నిందితుడిగా చేర్చిన సీఐడీ

గుంటూరు, మే 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికుట్రలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పాత్ర కూడా ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆయన్ను ఈ కేసులో 127వ నిందితుడిగా చేర్చారు. టీడీపీ ఆఫీస్‌పై దాడికి వైసీపీ ముఖ్య నేతలు కుట్ర చేసినట్లు ఇప్పటికే తేలిన విషయం తెలిసిందే. కుట్రదారుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి, లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్‌, నందిగం సురేశ్‌, దేవినేని అవినాశ్‌, న్యాయవాది గవాస్కర్‌లతో పాటు మరికొందరు ఉన్నారు. ఆ జాబితాలో రామకృష్ణారెడ్డి చేరారు. ఈ కేసులో తనను నిందితుడిగా చేర్చాల్సి వస్తే ముందుగా నోటీస్‌ ఇచ్చి విచారించాలని ఆయన గతంలో కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన ముందస్తు బెయిల్‌ కోసం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సీఐడీ అధికారులు ఆయన్ను 127వ నిందితుడిగా చేర్చారు. త్వరలోనే విచారణకు రావాలని నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు కొందరు నిందితులు అరెస్ట్‌ నుంచి కోర్టు ద్వారా రక్షణ పొందిన నేపథ్యంలో వారందరికీ నోటీసులు జారీ చేయడంతో పాటు కేసు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు.

Updated Date - May 28 , 2025 | 06:03 AM