ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

EX Deputy CM Narayanaswamy: నాకు తెలియదు..

ABN, Publish Date - Jul 22 , 2025 | 04:30 AM

గత వైసీపీ ప్రభుత్వంలో అమలుచేసిన మద్యం విధానాన్ని ఎలా రూపొందించారో తనకు తెలియదని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సిట్‌ అధికారులకు తెలిపారు.

  • మద్యం పాలసీ తయారీ నా దృష్టికి రాలేదు.. రాజ్‌ కసిరెడ్డి ఎవరో తెలియదు

  • వినియోగం తగ్గింపునకే సర్కారీ షాఫులు.. సిట్‌ ప్రశ్నలకు నారాయణస్వామి జవాబు

  • 30నిమిషాలు..14 ప్రశ్నలు.. ప్రతిదీ దాటవేత

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వంలో అమలుచేసిన మద్యం విధానాన్ని ఎలా రూపొందించారో తనకు తెలియదని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి సిట్‌ అధికారులకు తెలిపారు. అప్పట్లో ఆయన ఎక్సైజ్‌ శాఖ బాధ్యతలు చూశారు. రూ.3,500 కోట్ల భారీ కుంభకోణంలో ఆయనను ఈ నెల 21న ప్రశ్నించేందుకు ఇటీవల సిట్‌ నోటీసు జారీచేసింది. అనారోగ్య కారణాల రీత్యా తాను విజయవాడకు రాలేకపోతున్నట్లు నారాయణస్వామి సమాచారమిచ్చారు. దీంతో సోమవారం విజయవాడ నుంచి తిరుపతి వెళ్లిన సిట్‌ అధికారులు వీడియోకాల్‌ చేసి అక్కడి అధికారుల ద్వారా ప్రశ్నించినట్లు తెలిసింది. లిక్కర్‌ స్కామ్‌లో మాస్టర్‌ మైండ్‌ రాజ్‌ కసిరెడ్డి(ఏ1) ఎవరో తనకు తెలియదని, ప్రైవేటు షాపులుంటే వినియోగం తగ్గించడం కుదరదు గనుక ప్రభుత్వ షాపులు ఏర్పాటు చేస్తున్నట్లు తనకు చెప్పారని ఆయన బదులిచ్చినట్లు తెలిసింది. ఆయనకు ప్రతి నెల యాభై లక్షల రూపాయలు చొప్పున ముడుపులు అందజేసినట్లు సిట్‌ సేకరించిన ఆధారాలపై ప్రశ్నించగా, అసలు అవినీతే జరగనప్పుడు, తనకెందుకు డబ్బులిస్తారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. సుమారు 35 నిమిషాలపాటు 14 ప్రశ్నలు వేయగా, తాను చెప్పాల్సింది చెప్పి ఆరోగ్యం సహకరించడం లేదంటూ మాజీ మంత్రి మౌనం వహించినట్లు తెలిసింది.

Updated Date - Jul 22 , 2025 | 04:31 AM