ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam Dam: శ్రీశైలానికి తగ్గిన వరద ఆరు గేట్ల నుంచి నీటి విడుదల

ABN, Publish Date - Aug 03 , 2025 | 04:12 AM

ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 1,88,791 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది.

  • ఆరు గేట్ల నుంచి నీటి విడుదల

  • జలాశయం వద్ద పెరిగిన సందర్శకుల తాకిడి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం తగ్గింది. జూరాల, సుంకేసుల నుంచి 1,88,791 క్యూసెక్కుల నీరు శ్రీశైలం డ్యాంలోకి వచ్చి చేరుతోంది. దీంతో సాయంత్రం ఏడు గేట్ల ద్వారా 1,87,530 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేసిన అధికారులు రాత్రి 9 గంటలకు ఒక గేటు మూసివేసి ఆరు గేట్ల ద్వారా 1,61,016 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ ఉత్పాదన నిమిత్తం మరో 66,102 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు చేరింది. డ్యాంలో 200.6588 టీఎంసీల నీరు ఉంది. వారాంతం కావడంతో శనివారం జలాశయం వద్ద సందర్శకుల తాకిడి పెరిగింది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌ డ్యాంలోకి 2,10,499 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ 18 గేట్ల ద్వారా 1,36,656 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా 29,070, కుడి కాలువ ద్వారా 8023, ఎడమ కాలువ ద్వారా 7937, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1800, ఎల్‌ఎల్‌సీ ద్వారా 300 క్యూసెక్కులు, మొత్తం 1,83,786 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 585.30 అడుగులు ఉంది. పులిచింతల ప్రాజెక్టులో 40.77 టీఎంసీల నీరు ఉన్నట్టు ఆ ప్రాజెక్టు ఏఈ రాజు తెలిపారు. ఎగువ నుంచి 1,81,808 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. 7 గేట్ల ద్వారా 1,65,069, విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 16,600, లీకుల ద్వారా 400 క్యూసెక్కులు మొత్తం 1,82,069 క్యూసెక్కుల నీరు దిగువనున్న ప్రకాశం బ్యారేజీకి విడుదలవుతోంది.

Updated Date - Aug 03 , 2025 | 04:13 AM