ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సుంకేసులకు వరద

ABN, Publish Date - May 21 , 2025 | 11:31 PM

రుతు పవనాలు ముందుగానే పలకరించాయి. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

హంద్రీనదిలో ప్రవహిస్తున్న వరద నీరు

ఎన్నో ఏళ్ల తర్వాత మే నెలలో తుంగభద్రకు వరద

హంద్రీలో వరద ప్రవాహం

జిల్లాలో విస్తారంగా వర్షాలు

కర్నూలు, మే 21 (ఆంధ్రజ్యోతి): రుతు పవనాలు ముందుగానే పలకరించాయి. జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన కర్ణాటకలో సైతం భారీవర్షాలు కురుస్తుండటంతో తుంగభద్రకు ఉపనది అయిన వేదవతి పొంగిపొర్లుతుంది. ఆర్డీఎస్‌ ఆనకట్టపై వరద పోటెత్తింది. బుధవారం కేంద్ర జలసంఘం (సీడబ్లూసీ), జలవనరుల శాఖ గేజింగ్‌ రికార్డుల ప్రకారం కోసిగి మండలం మేలగనూరు వద్ద తుంగభద్రలో 20వేల క్యూసెక్కుల వరద కొనసాగుతుంది. మంత్రాలయం వద్ద 20,140 క్యూసెక్కుల వరద ప్రవహిస్తుంది. సుంకేసుల బ్యారేజీకి 17,916 క్యూసెక్కులు వరద ఉంది. దాదాపు పదేళ్ల తర్వాత మే నెలలో తుంగభద్రకు వరద రావడం ఇదే ప్రథమం. జిల్లాలో ప్రవహించే హంద్రీ నదికి వరద చేరడంతో కర్నూలు నగరం రాజ్‌విహార్‌లో వరద నీటి ప్రవాహంతో నగర వాసులను కనువిందు చేస్తుంది. దాదాపు పదేళ్ల తర్వాత హంద్రీకి మే నెలలో వరద రావడం ప్రథమమని ఇరిగేషన అధికారులు అంటున్నారు. సుంకేసుల బ్యారేజీని ఇరిగేషన ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఇరిగేషన అధికారులు పరిశీలించారు. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే సుంకేసుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది.

Updated Date - May 21 , 2025 | 11:31 PM