సరసాల సార్ సస్పెండ్!
ABN, Publish Date - May 05 , 2025 | 01:31 AM
హరిత బెర్మ్ పార్క్, ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో కామకలాపాలు సాగిస్తున్న సరసాల సార్ సస్పెండ్ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లు ఓ మహిళతో రాసలీలలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఏపీటీడీసీ ఉన్నతాధికారులు అతనిపై శాఖాపరంగా తక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం అధికారికంగా సస్పెన్షన్ లేటర్ ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా వాట్సాప్ ద్వారా కూడా సస్పెన్షన్ ఆర్డర్‌ను అతనికి పంపనున్నారు.
- ఏపీటీడీసీ డివిజనల్ ఆఫీస్ అకౌంటెంట్ గంగి వెంకటేశ్వర్లుపై వేటు!
- భవానీపురం ప్రాంత మహిళతో రాసలీలలు!
- హరిత బెర్మ్ పార్క్, ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో కామకలాపాలు
- వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’.. ఒక్క రోజులో విచారణ పూర్తి
- వెంకటేశ్వర్లును సస్పెండ్ చేసిన ఏపీటీడీసీ డివిజనల్ అధికారులు!
- నేడు సస్పెన్షన్ ఆర్డర్ అందచేత
హరిత బెర్మ్ పార్క్, ఏపీటీడీసీ ప్రధాన కార్యాలయంలో కామకలాపాలు సాగిస్తున్న సరసాల సార్ సస్పెండ్ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లు ఓ మహిళతో రాసలీలలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన ఏపీటీడీసీ ఉన్నతాధికారులు అతనిపై శాఖాపరంగా తక్షణ చర్యలు చేపట్టారు. సోమవారం అధికారికంగా సస్పెన్షన్ లేటర్ ఇవ్వనున్నారు. వ్యక్తిగతంగా వాట్సాప్ ద్వారా కూడా సస్పెన్షన్ ఆర్డర్‌ను అతనికి పంపనున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి ఒకరు రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను వెంటబెట్టుకుని కార్యాలయానికి వచ్చి కామకలాపాలు సాగిస్తున్నారు. దీనిపై ‘సరసాల సార్!’ అనే శీర్షికతో ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై ఏపీటీడీసీ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. కార్యాలయంలో రాసలీలలు సాగిస్తున్నది పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) విజయవాడ డివిజనల్ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న గంగి వెంకటేశ్వర్లుగా గుర్తించారు. విచారణను త్వరగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు. విజయవాడ డివిజన్ అధికారులు శరవేగంగా విచారణను పూర్తి చేసి ఆదివారం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) పద్మావతికి నివేదికను అందించారు. ఏపీటీడీసీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈడీ పద్మావతి కూడా ఆగమేఘాల మీద సస్పెండ్ చేయాల్సిందిగా విజయవాడ డివిజన్ అధికారులకు నిర్దేశించారు. విజయవాడ డివిజన్ అధికారులు సస్పెన్షన్ ఆర్డర్‌ను సిద్ధం చేశారు. ఈ ఆర్డర్‌ను సోమవారం అకౌంటెంట్ వెంకటేశ్వర్లుకు అందించనున్నారు. అతని వాట్సాప్‌కు కూడా సస్పెన్షన్ ఆర్డర్‌ను పంపించనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తిని ప్రైవేటు అవసరాల కోసం దుర్వినియోగం చేయటంపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఆర్డర్‌లో పేర్కొన్నట్టు సమాచారం. విజయవాడ హెడ్ క్వార్టర్ పరిధి దాటి ఎక్కడికీ వెళ్లకూడదని కూడా వెంకటేశ్వర్లును ఏపీటీడీసీ ఉన్నతాధికారులు ఆదేశించారు.
నాడు వీడియోలు తీసి బయటపెట్టినా మారని తీరు!
అకౌంటెంట్ వెంకటేశ్వర్లు చాలా కాలంగా ఒక మహిళతో ఏపీటీడీసీ ఆఫీసుల్లో రాసలీలలు సాగిస్తున్నాడని విచారణలో అధికారులు గుర్తించారు. గతంలో హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో సాగించిన రాసలీలలు, విజయవాడ డివిజన్ ప్రధాన కార్యాలయంలో సాగించిన రాసలీలల్లో వెంకటేశ్వర్లు ప్రత్యక్షంగా పాల్గొన్నారని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిర్థారించారు. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో అత్యంత జుగుప్సాకరంగా ఉన్న దృశ్యాలు బయటపడినట్టు సమాచారం. హరిత బెర్మ్‌పార్క్‌లో సాగించిన రాసలీలల వీడియోలు దారుణంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. డివిజనల్ ఆఫీసుకు కూడా తరచూ బైక్‌పై మహిళను ఎక్కించుకుని వస్తుండటం, కార్యాలయంలోకి ఆ మహిళను తీసుకు వెళ్లి తలుపులు వేసుకోవటం, అర్ధగంట తర్వాత ఇద్దరూ కలిసి బయటకు వచ్చి వాహనం మీద తిరిగి వెళ్లిపోతున్న దృశ్యాల్లోనూ వెంకటేశ్వర్లు ఉన్నట్టుగా గుర్తించారు. వెంక టేశ్వర్లుతో ఉన్న మహిళ ఎవరు అన్న దానిపై కూడా ఏపీటీడీసీ అధికారులు విచారణ జరిపారు. నగరానికి చెందిన మహిళగా గుర్తించారు. తరచూ వాకింగ్ చేయటానికి హరిత బెర్మ్ పార్క్‌కు వస్తుందని, ఆ సమయంలోనే వెంకటేశ్వర్లు ఆమెను ట్రాప్ చేసి లోబరుచుకున్నట్టు తెలిసింది. అప్పటి నుంచి తరచూ హరిత బెర్మ్‌పార్క్ స్టాఫ్ రూమ్‌లోనే వీరిద్దరూ తరచూ ఏకాంతంగా ఉండేవారని సమాచారం. స్టాఫ్ రూమ్‌లో కామక్రీడల వ్యవహారాన్ని అక్కడి సిబ్బంది వీడియోలు తీసి బయట పెట్టడంతో ఏకంగా విజయవాడ డివిజనల్ కార్యాలయాన్నే ఇందుకోసం ఎంపిక చేసుకుని కామకలాపాలు సాగించటం ప్రారంభించారు. కొద్ది నెలలుగా తరచూ మహిళతో వస్తున్న అకౌంటెంట్ వ్యవహార శైలిపై అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది.
Updated Date - May 05 , 2025 | 01:31 AM