ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘తొలిఅడుగు’ విజయవంతం

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:33 PM

కార్యకర్తలు, నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని సమష్టిగా విజయవంతం చేశామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న తిక్కారెడ్డి

ఆగస్టులో జిల్లాకు రానున్న చంద్రబాబు, లోకేశ

గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ పనులకు గ్రీన సిగ్నల్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు అర్బన, జూలై 30 (ఆంధ్రజ్యోతి): కార్యకర్తలు, నాయకుల మధ్య చిన్నపాటి విభేదాలు ఉన్నప్పటికీ ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని సమష్టిగా విజయవంతం చేశామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి అడుగు కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజా సంక్షేమాన్ని తెలియజేయడంతో పాటు వైసీపీ కుట్రలను కూడా వివరించామన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఆగస్టు నెలలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ వస్తున్నారన్నారు. వారు ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటిస్తారని తెలిపారు. కర్నూలు జిల్లా పరిశ్రమల హబ్‌గా మారబోతోందన్నారు. ఉమ్మడి జిల్లాలో 30 వేల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. పోలవరం, అమరావతితో పాటు జిల్లాలో గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్‌ పనులకు సీఎం చంద్రబాబు గ్రీన సిగ్నల్‌ఇచ్చారని, భూసేకరణకు అవసరమైన నిధులు కూడా ఇస్తామని చెప్పారన్నారు.

కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో అంతా అవినీతిలోనే నడిచిందని, వారు చేసిన స్కామ్‌లు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. వైసీపీ నాయకులు జగనకు మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక పరామర్శల పేరుతో ఆరాచకాలు సృష్టించేదుకు జగన కుట్రలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కేఈ జగదీష్‌ కుమార్‌, ప్రముఖ విద్యా సంస్థల అధినేత కేవీ సుబ్బారెడ్డి, కార్పొరేషన డైరెక్టర్లు పోతురాజు రవికుమార్‌, ధరూర్‌ జేమ్స్‌, ముంతాజ్‌, జిల్లా కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, బేతం కృష్ణుడు, హనుమంతరావు చౌదరీ, పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2025 | 11:33 PM