ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అన్నదాత సుఖీభవతో ఆర్థిక తోడ్పాటు

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:12 AM

వ్యవ సాయ రైతుకు అన్నదాత సుఖీభవ ఆర్థిక తోడ్పా టునందిస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.

అన్నదాత సుఖీభవ చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే ఆది, భూపేశ ఆర్డీవో సాయిశ్రీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో రైతులకు లబ్ధి ప్రకృతి వ్యవసాయం వైపు మారాలి ఎమ్మెల్యే ఆది, ఆర్డీవో సాయిశ్రీ, టీడీపీ నేతభూపేశ్‌రెడ్డి

జమ్మలమడుగు, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వ్యవ సాయ రైతుకు అన్నదాత సుఖీభవ ఆర్థిక తోడ్పా టునందిస్తుందని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలు సాగు చేయాలని కోరారు. శనివారం జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయ సభాభవనంలో ప్రభుత్వం రైతులకు అందించే అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్‌ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉద్ధేశ్యమన్నారు. గత ప్రభుత్వం రైతులకు ఏడాదికి రూ.13,500 ఇస్తే కూటమి ప్రభుత్వం రూ.20 వేలు ఇవ్వడం జరుగుతోందన్నారు. అందులో భాగంగా శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నదాత సుఖీభవ కింద మొదటి విడత కింద రూ.7 వేలు రైతుల ఖాతాల్లో వేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో సాయిశ్రీ మాట్లాడుతూ కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. రైతులు ప్రకృతి వ్యవసాయంవైపు మొగ్గు చూపాలన్నారు. టీడీపీ ఇనచార్జి భూపేశ్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో 35,184 మంది రైతులకు రూ.24.11 కోట్లను అన్నదాత సుఖీభవ పథకం కింద విడుదల చేశారన్నారు. జమ్మలమడుగు మండలంలో 4,554 మంది రైతులకు రూ.3.12 కోట్లు, కొండాపురంలో 5480 మందిరైతులకు రూ.4 కోట్లు, మైలవరంలో 6261 మంది రైతులకు రూ.4.21 కోట్లు, పెద్దముడియం 7542 మంది రైతులకు 5.15 కోట్లు, ఎర్రగుంట్లలో 5597 మంది రైతులకు 3.84 కోట్లు రైతులకు వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. అనంతరం డీపీఎం ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల స్టాల్‌ను ఎమ్మెల్యే, ఆర్డీవో పరిశీలించారు. జమ్మలమడుగు మార్కెట్‌యార్డు చైర్మన్‌ సింగంరెడ్డి నాగేశ్వరరెడ్డి, ఏవో శ్రీకాంత్‌రెడ్డి, వ్యవసాయాధికారులు, ప్రకృతి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

రాజుపాలెంలో: అన్నదాత సుఖీభవ ద్వారా 6111 మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2వేలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.5వేలుతో మండలంలోని 6111 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని ఏవో శివరామక్రిష్ణరెడ్డి తెలిపారు. శనివారం మండలానికి రూ.4.19 కోట్లు రైతు ఖాతాల్లో జమ అవుతోందన్నారు.

దువ్వూరులో: అన్నదాత పీఎం కిసాన్‌ నిధులు శనివారం రైతుల ఖాతాల్లో జమ అయినట్లు మండల వ ్యవసాయాధికారి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు. పీఎం కిసాన్‌ పథకం నిఽధులు రూ.2 వేలు, అన్నదాత పథకం కింద రూ.5 వేలు తొలి విడతగా రైతులకు అందనున్నట్లు పేర్కొన్నారు. దువ్వూరు మండలానికి చెందిన 7,071 మంది రైతులకు రూ.4,94,099లు లబ్ధిచేకూరిందన్నారు.

మైదుకూరు రూరల్‌లో : రైతుల సంక్షేమమే సీఎం చంద్రబాబు ధ్యేయమని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏపీ రవీంద్ర పేర్కొన్నారు.మండలంలోని వనిపెంట కృషి విజ్ఞానకేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన రైతులు, అధికారులు సమావేశం లో అన్నదాత సుఖీభవ పథకం నిధుల విడుదల కార్యక్రమం జరిగింది. రాష్ట్ర మార్కెఫెడ్‌ డైరెక్టర్‌ శశిభూషన్‌, బీజేపీ నేత బీపీ ప్రతాప్‌ పాల్గొన్నారు.

బ్రహ్మంగారిమఠంలో: మండలంలో అన్నదాత సుఖీభవ కింద 5862 మంది రైతులకు మొత్తం రూ.4.11 కోట్లు వారి ఖాతాల్లో జమ కావడం జరుగుతుందని పోరుమామిళ్ల ఏడీ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Updated Date - Aug 03 , 2025 | 12:12 AM