Tirupati: ఎస్వీ జూపార్కులో ఆడ పులి మృతి
ABN, Publish Date - Aug 03 , 2025 | 04:48 AM
తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో శనివారం ఓ ఆడపులి అనారోగ్యంతో మృతి చెందింది. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ కంపార్ట్‌మెంట్ నంబరు 707లో ఉన్న ఆడపులి మెడ భాగంలో గాయం కావడంతో...
తిరుపతి(మంగళం), ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని ఎస్వీ జూపార్కులో శనివారం ఓ ఆడపులి అనారోగ్యంతో మృతి చెందింది. ఆత్మకూరు ప్రాజెక్టు టైగర్ డివిజన్ కంపార్ట్‌మెంట్ నంబరు 707లో ఉన్న ఆడపులి మెడ భాగంలో గాయం కావడంతో గత నెల 6న ఎస్వీ జూపార్కుకు తీసుకొచ్చారు. 7వ తేదీన ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ సర్జరీ విభాగ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. 16న మరోసారి శస్త్ర చికిత్స చేశారు. అనంతరం పులికి మెత్తటి మాంసం, గ్లూకోజ్, ఎలకోట్రల్‌తో పాటు యాంటీ బయాటిక్స్ ఇచ్చారు. ఈ క్రమంలో 30వ తేదీ నుంచి ఆహారం తీసుకోకుండా నీళ్లు తాగుతూ నీరసపడిన పులి శనివారం తెల్లవారుజామున చనిపోయింది. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పేథాలజీ విభాగ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేసి సెప్టీకిమియా షాక్ వల్ల పులి మృతి చెందినట్టు నిర్ధారించారు. అనంతరం పులి కళేబరాన్ని ఎస్వీ జూపార్కులో ఖననం చేశారు.
Updated Date - Aug 03 , 2025 | 04:51 AM