ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chittoor: తండ్రీకూతుళ్లు.. ఒకేసారి టెన్త్‌ పాసయ్యారు

ABN, Publish Date - Apr 24 , 2025 | 05:12 AM

చిత్తూరు జిల్లా రొంపిచెర్లలో తండ్రి షబ్బీర్‌ మరియు కుమార్తె సమీనా కలిసి పదో తరగతి పరీక్షలు ఉత్తీర్ణులయ్యారు. షబ్బీర్‌ ఓపెన్‌ స్కూల్‌లో పరీక్షలు రాస్తూ 319 మార్కులు సాధించగా, కుమార్తె సమీనా 309 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

రొంపిచెర్ల, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా రొంపిచెర్లకు చెందిన తండ్రి, కుమార్తె టెన్త్‌ పరీక్షల్లో ఒకేసారి ఉత్తీర్ణులయ్యారు. స్థానిక పాలెం వీధికి చెందిన ఆర్టీసీ కండక్టర్‌ బాకా ఇస్మాయిల్‌ కుమారుడు షబ్బీర్‌ 1995-96లో 10వ తరగతి ఫెయిలయ్యారు. అనంతరం ఆయన తండ్రి ఇస్మాయిల్‌ కండక్టర్‌గా పనిచేస్తూ మృతిచెందారు. ఈలోపు షబ్బీర్‌ ప్రమాదవశాత్తు దివ్యాంగుడిగా మారారు. తండ్రి ఆర్టీసీలో పనిచేస్తూ మరణించడంతో పదో తరగతి పాసయితే తనకు ఏదో ఒక ఉద్యోగం వస్తుందనే ఉద్దేశంతో షబ్బీర్‌ ఈ ఏడాది సదుంలో ఓపెన్‌ స్కూల్‌లో పరీక్షలు రాశారు. ఆయన కుమార్తె సమీనా రొంపిచెర్ల బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివి పరీక్షలు రాసింది. బుధవారం వెలువడిన ఫలితాల్లో షబ్బీర్‌కు 319 మార్కులు రాగా, సమీనా 309 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.


Also Read:

ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..

లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...

ప్రధాని నివాసంలో కీలక సమావేశం..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 24 , 2025 | 05:12 AM