వరి సాగుకు రైతన్న సన్నద్ధం
ABN, Publish Date - Jul 19 , 2025 | 11:28 PM
ఎన్నడూ లేని విధంగా మండలంలోని రైతులు ఈఏడాది ఖరీఫ్‌లో మూడు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
- కుందూనదిలో భారీగా నీటి ప్రవాహం
- నిండు కుండలా రూపనగుడి చెరువు
ఉయ్యాలవాడ, జూలై 19(ఆంధ్రజ్యోతి): ఎన్నడూ లేని విధంగా మండలంలోని రైతులు ఈఏడాది ఖరీఫ్‌లో మూడు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వెయ్యి ఎకరాలు అదనంగా వరి సాగు చేస్తున్నారు. మండలం లో ఉన్న 21 గ్రామాల్లో 18 గ్రామాలు కుందూ, పాలేరు, చెరువుల ఆయ కట్టు కింద ఉన్నాయి. మండలంలోని మాయలూరు, సుద్దమల్ల, అల్లూ రు, రూపనగుడి గ్రామాల్లో ఇప్పటికే వరినాటుకు మడులను సిద్ధం చేస్తున్నారు. శనివారం మాయలూరులో రైతులు వరి నాట్లు వేశారు.
కుందూనది, పాలేరు వాగుల్లో నీటి ప్రవాహం
మండలంలోని కుందూ, పాలేరు నదుల్లో నీటి ప్రవాహం అధికంగా ఉంది. ఇటీవల కుందూనదికి నీటిని విడుదల చేశారు. కుందూ నది కింద దాదాపుగా రెండు వేల ఎకరాల్లో ఆయకట్టు సాగు అవుతుంది. పా లేరు వాగు కింద దాదాపు 300 ఎకరాల్లో పంట సాగు అవుతుంది.
చెరువుల్లో జలకళ
మండలంలోని రూపనగుడి, తుడుమల దిన్నె గ్రామాల చెరువుల్లో నీరు జలకళగా ఉంది. ఆయా గ్రామాల ఆయ కట్టు రైతులు వరి పం ట సా గుకు సిద్ధం అవుతున్నారు. రూపనగుడి గ్రామంలోని రైతులు నారు మల్లు తయారు చేసి అందులో మొలక చాల్లారు. మరో 30 రోజుల్లో ఈ ఆయకట్టు కింద దాదాపుగా 700ఎకరాల్లో వరి పంట సాగు అవుతుంది.
ఏడేళ్ల తరువాత ఆయకట్టు కింద వరి సాగు
మండలంలోని రూపనగుడి గ్రామ చెరువు ఆయకట్టు కింద దాదాపుగా ఏడేళ్ల తరువాత వరి పంట సాగు అవుతుంది. ప్రతి ఏడాది చెరువులో నీళ్లు ఉన్నా కాని ఆ గ్రామ రైతులు వరి సాగు చేసేవారు కాదు. ఇటీవల ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖలప్రియ చొరువ చూపి చెరువు ను మరమ్మతు చేయించారు. అలాగే పంట కాలువల్లో పూడికతీత పనులు చేపట్టి నీటిని విడుదల చేశారు. దీంతో రైతులు ఆయకట్టు కింద వరిపంట సాగుకు సిద్ధం అవుతున్నారు. ఈ ఆయకట్టు కింద దాదాపుగా 350 ఎకరాల్లో వరిపంట సాగవుతుంది.
బోరుబావుల కింద వరి నాట్లు
రుద్రవరం : రైతులు వ్యవసాయ బోరుబావుల కింద వరి నాట్లు జోరందుకున్నాయి. రుద్రవరం మండలంలోని ఆలమూరు, ముకుందాపురం, చిత్తరేణిపల్లె, వెలగలపల్లె, కొండమాయపల్లె తదితర గ్రామాల్లో ముందస్తుగానే వరి నాట్లు సాగు చేస్తున్నారు. ఆయా గ్రామాల పరిధిలో సుమారు 400 ఎకరాల్లో వరినాట్లు వేశారు.
ప్రవహిస్తున్న పాలేరు వాగు
సంజామల: మండలంలోని పది గ్రామాలకు సాగునీరు అందించే పాలేరు వాగు ప్రవహిస్తుండడంతో పరివాహక ప్రాంతాల రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత నెల చివరివారం నుంచి ఈనెల 15 వరకు పాలేరు వాగు వట్టిపోయింది. దీంతో పరివాహకంలో తాగు, సాగునీటి సమస్య ఎదుర్కొన్నారు. ఈనెల 8న సీఎం చంద్ర బాబు నాయుడు శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు ఎత్తి దిగువకు కృష్ణాజలాలు విడుదల చేశారు. ఎస్సార్బీసీ ద్వారా అవుకు రిజర్వాయరుకు చేరి గొల్ల లేరు డ్రయిన ద్వారా పాలేరు వాగుకు చేరాయి. ఏడాది ఖరీఫ్‌లో ముందస్తు వర్షాలు కురవడంతో అత్యధిక విస్తీర్ణంలో మొక్కజొన్న, మి నుములు సాగు చేశారు. వరినాట్లు వేసేందుకు నారుమళ్లు పోసుకున్న రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో పాలేరు వాగు ప్రవహించడం, మూడు రోజులు నుంచి వర్షాలు కురియడంతో వరిరైతులు సంబరం పడుతున్నారు.
Updated Date - Jul 19 , 2025 | 11:28 PM