Farmer Subba Reddy: నన్నెవరూ బెదిరించలేదు.. భయపెట్టలేదు
ABN, Publish Date - Jul 19 , 2025 | 06:01 AM
నన్నెవరూ బెదిరించలేదు.. భయపెట్టలేదు.. జగన్ పత్రిక తప్పుడు కథనాలతో రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది అని బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన బర్లీ రైతు గుదిబండి సుబ్బారెడ్డి ఆరోపించారు.
జగన్ పత్రిక అసత్య కథనాలు మానుకోవాలి
సంతనూతలపాడు బర్లీ రైతు సుబ్బారెడ్డి వెల్లడి
పర్చూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): ‘నన్నెవరూ బెదిరించలేదు.. భయపెట్టలేదు.. జగన్ పత్రిక తప్పుడు కథనాలతో రైతుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ, వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది’ అని బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడుకు చెందిన బర్లీ రైతు గుదిబండి సుబ్బారెడ్డి ఆరోపించారు. శుక్రవారం రోత పత్రికలో వెలువడిన కథనాలపై ఆయన మండిపడ్డారు. పొగాకును తొక్కించానని జగన్ పత్రికలో వచ్చిన కథనంతో కలత చెందినట్లు చెప్పారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఫోన్‌లో తనను పరామర్శించారని తెలిపారు. పాడైన, పనికిరాని పొగాకును పొలానికి ఎరువుగా వినియోగించడానికి తొక్కించానని ఎమ్మెల్యేకి చెప్పినట్లు వివరించారు. జగన్ పత్రికలో మాత్రం తనను బెదిరించినట్లు, హెచ్చరించినట్లు కథనం అల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతును ఎమ్మెల్యే పరామర్శించడం నేరమా అని సుబ్బారెడ్డి ప్రశ్నించారు. అసత్య వార్తలు ప్రచురించడం ఆ పత్రికకు పరిపాటిగా మారిందన్నారు. ఈ ధోరణిని వ్యతిరేకిస్తూ రైతులతో కలసి నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. పనికిరాని పొగాకును మాత్రమే ఎరువు కోసం వినియోగించానని, మిగిలిన పంటను విక్రయానికి సిద్ధంచేసి తన గోదాములో భద్రపరిచినట్లు స్పష్టం చేశారు. ప్రతి చివరి ఆకు వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే చెప్పారని ఆయన పేర్కొన్నారు.
Updated Date - Jul 19 , 2025 | 06:03 AM