ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

2న కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో నిరసన

ABN, Publish Date - Mar 31 , 2025 | 11:53 PM

ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఏప్రిల్‌ 2వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది.

మాట్లాడుతున్న కాకి ప్రకా్‌షరావు

కర్నూలు ఎడ్యుకేషన, మార్చి 31 (ఆంధ్రజ్యోతి) : ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ఏప్రిల్‌ 2వ తేదీన మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల వరకు నిరసన కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా సోమవారం ఎస్టీయు భవనలో రాష్ట్ర, జిల్లా నాయకులతో ఫ్యాప్టో చైర్మన సేవాలాల్‌ నాయక్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఫ్యాప్టో రాష్ట్ర కో చైర్మన కే.ప్రకా్‌షరావు, రాష్ట్ర ఎగ్జిక్యూటీవ్‌ కమిటీ సభ్యులు జి.హృదయరాజు హాజరయ్యారు. రాష్ట్ర కో చైర్మన కే.ప్రకా్‌షరావు మాట్లాడుతూ కరోనా కాలం నుంచి మరణించిన ఉపాధ్యాయ, ఉద్యోగుల పిల్లలకు ఇవ్వాల్సిన కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. జి.హృదయరాజు మాట్లాడుతూ డీఏ బకాయిలు చాలా ఉన్నాయని, వాటిని వెంటనే ప్రకటించాలని, సరెండర్‌ లీవ్‌ బకాయిలు 2022 నుంచి పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కొన్నింటిని చెల్లించినా కూడా చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు సేవాలాల్‌ నాయక్‌, భాస్కర్‌, రంగన్న, రవికుమార్‌, నవీనపాటిల్‌, గోకారి, జనార్దన, శ్రీనివాసరెడ్డి, వెంకటరాముడు, నందీశ్వరుడు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2025 | 11:53 PM