ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kakani Arrest Hunt: కాకాణికనిపిస్తే అరెస్టే

ABN, Publish Date - Apr 11 , 2025 | 06:35 AM

క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల్లో ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీస్ ఉచ్చు బిగుస్తోంది. విచారణకు హాజరుకాకపోవడంతో లుకవుట్ నోటీసులు జారీ చేశారు

  • మాజీ మంత్రి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

  • లుకవుట్‌ నోటీసులు జారీ

  • విదేశాలకు చెక్కేయకుండా కట్టడి

  • ఆచూకీ కోసం 7 పోలీసు బృందాలు

  • వివిధ ప్రాంతాల్లో ముమ్మర గాలింపు

నెల్లూరు, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకం, దోపిడీ వ్యవహారంలో విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఆయనపై గురువారం లుకవుట్‌ నోటీసులు జారీచేశారు. దీంతో ఆయన విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లోనే అడ్డుకుంటారన్న మాట. క్వార్డ్జ్‌ అక్రమ తవ్వకాల కేసులో కాకాణిపై కేసు నమోదు కావడం, విచారణకు రావాలని ఎన్ని సార్లు నోటీసులిచ్చినా లెక్కచేయకపోవడం.. వాటిని తీసుకునేందుకు ఇళ్లలోనే ఉండకపోవడం.. ముందస్తు బెయిల్‌ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం.. తదితర పరిణామాల క్రమంలో గత కొద్ది రోజులుగా కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా హైకోర్టు బుధవారం ఆయన బెయిల్‌ పిటిషన్‌ను డిస్మస్‌ చేయడంతో.. అరెస్టు చేయడానికి పోలీసులు వివిధ ప్రాంతాల్లో ఉధృతంగా గాలిస్తున్నారు. ఏడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాష్ట్రంతో పాటు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నగరాల్లో సైతం వేటాడుతున్నట్లు సమాచారం. కాకాణి కనిపించడమే తరువాయి.. అరెస్టు చేయడం ఖాయమని పోలీసు వర్గాలు అంటున్నాయి.

Updated Date - Apr 11 , 2025 | 06:35 AM