ప్రమాదమని తెలిసినా..పట్టించుకోరా..?
ABN, Publish Date - May 11 , 2025 | 11:38 PM
జమ్మలమడుగు శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా తేరురోడ్డుకు వెళ్లే దారి నడి రోడ్డులో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది.
జమ్మలమడుగు, మే 11 (ఆంధ్రజ్యోతి): జమ్మలమడుగు శ్రీ నారాపురం వెంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా తేరురోడ్డుకు వెళ్లే దారి నడి రోడ్డులో విద్యుత్తు ట్రాన్స్‌ఫార్మర్ ప్రమాదకరంగా మారింది. ఇటీవల జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, టీటీడీ బోర్డు మెంబరు భానుప్రకాష్‌రెడ్డి, ఆలయాన్ని సందర్శించినప్పుడు విద్యుత అధికారులు హాజరయ్యారా అంటూ ఎమ్మెల్యే ఆలయ పండితులతో, అధికారులతో ఆరా తీశారు. ఆదివారం కూటమి నాయకుడు గోనా పురుషోత్తంరెడ్డి రోడ్డుకు అడ్డంగా ట్రాన్స్‌ఫార్మర్ ఉందని ప్రమాదం జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యకు సంబందించి జమ్మలమడుగు విద్యుత శాఖ ఏడీ రాజగోపాల్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా ఆలయం ఎదురుగా నడి రోడ్డుపై తేరు రోడ్డుకు ట్రాన్స్‌ఫార్మర్ ఉందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్‌ను త్వరగా తొలగిస్తామని ఆయన తెలిపారు.
Updated Date - May 11 , 2025 | 11:39 PM