కార్యకర్తలకు అండగా టీడీపీ
ABN, Publish Date - May 22 , 2025 | 11:42 PM
ఎన్టీఆర్ మహోన్నత ఆశయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాతే రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వచ్చింది.
నామినేటెడ్ పదువుల్లో వారికే ప్రాధాన్యం
చంద్రబాబు, లోకేశ స్ఫూర్తితో పార్టీ బలోపేతం
కందనవోలు ప్రగతి కోసం సమష్టిగా శ్రమిద్ధాం
జిల్లా మహానాడులో టీడీపీ నేతల వెల్లడి
మహా‘జన’ సందడిగా జిల్లా మహానాడు
కర్నూలు/కర్నూలు అర్బన, మే 22 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ మహోన్నత ఆశయంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాతే రాష్ట్రంలో రాజకీయ చైతన్యం వచ్చింది. బీసీలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు చట్టసభల్లో అడుగు పెట్టారు. గెలుపు సైనికులు కార్యకర్తలకు ఎల్లవేళల టీడీపీ అండగా ఉంటుంది.. నామినేటెడ్ పదువులు పంపకాల్లోనూ, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా మహానాడు వేదికగా టీడీపీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతనిధులు పేర్కొన్నారు. కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న మహానాడుకు టీడీపీ శ్రేణులను సమాయత్తం చేయడం, జిల్లాలో చేపట్టాల్సి అభివృద్ధి పనులపై చర్చించి తీర్మానాలు చేయడం కోసం గురువారం స్థానిక కమ్మ సంఘం కల్యాణ మండపంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి అధ్యక్షతన జిల్లా మహానాడు సభ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సభాప్రాంగణమంతా జనంతో నిండిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ రాజకీయ శూన్యతలో రాష్ట్రం ఉన్న సమయంలో ఎన్టీఆర్ బలహీనవర్గాల పునాదులపై టీడీపీ స్థాపించారన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, యువనేత నారా లోకేశ శ్రమిస్తున్నారని అన్నారు. ఎంపీటీసీగా ఉన్న తనను ఎంపీగా చేసి పార్లమెంట్‌కు పంపిన ఘనత టీడీపీదే అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రక్షణ చట్టం సాధించుకుందామని పిలుపునిచ్చారు. టీడీపీ అధ్యక్షుడు పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీ కోసం పని చేసిన ఎందరికో రాష్ట్ర, జిల్లా నామినేటెడ్ పదవులు వచ్చాయని, మిగిలిన కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో జిల్లాకు వచ్చిన అధినేత చంద్రబాబు, పాదయాత్రలో యువనేత నారా లోకేశ ఇచ్చిన హామీలు అమలకు పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నారని గుర్తు చేశారు. జిల్లాల్లో ప్రాజెక్టులు నిర్మాణాలు, పారిశ్రామిక ప్రగతికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. తన నాయకత్వంలో జిల్లాలో టీడీపీ ఘన విజయం అందుకోవడం, జిల్లా మహానాడుకు నాయకత్వం వహించడం మరవలేని జ్ఞాపకమన్నారు. కడపలో జరగబోయే మహానాడుకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఏపీ వాల్మీకి కార్పొరేషన చైర్‌పర్సన కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఏపీ కురవ/కురబ కార్పొరేషన చైర్మన మాన్వి దేవేంద్రప్ప, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్, ఏపీ టూరిజం డైరెక్టర్, తెలుగుమహిళా జిల్లా అధ్యక్షురాలు ముంతాజ్‌బేగం, కమ్మ సంఘం నాయకుడు రాజశేఖర్ తదితరులు ప్రసగించారు. అంతకు ముందు టీడీపీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. తెలుగుదేశం జెండాను ఎగురవేశారు. వివిధ కారణాలతో మృతి చెందిన టీడీపీ శ్రేణులు, పాకిస్థాన ప్రేరేపిత తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు వీడిన పహల్గాం మృతులు, యుద్ధంలో అమరులైన భారత జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకేపోగు ప్రభాకర్, మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్‌కుమార్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కీలక నాయకులు పాల్గొన్నారు.
ఫ జగనది రివర్స్ పాలన
- బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే
వైసీపీ హయాంలో జగన రివర్స్ టెండర్స్ పేటిర రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సన్మానాలు చేసి రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు రాకుండా మోసం చేశారు. గుండ్రేవుల, వేదవతి, ఆర్డీఎస్ కుడి కాలువ, హంద్రీనీవా పత్తికొండ జలాశయం కోసం తీర్మానం చేస్తున్నాం. జగన సొంత జిల్లాలో 5 లక్షల మందితో మహానాడు ఘనంగా నిర్వహించబోతున్నాం.
ఫ దళిత సోదరుల్లారా మేల్కోండి
- బొగ్గుల దస్తగిరి, కోడుమూరు ఎమ్మెల్యే
కోడుమూరు అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతాను. అధినేత చంద్రబాబు ప్రొత్సాహం, విష్ణు అన్న సహకారంతో ఎమ్మెల్యేగా గెలిచాను. మా అమ్మ సర్పంచగా.. నేను ఎమ్మెల్యేగా ఉండే ఈ గడ్డపై జిల్లా మహానాడు జరగడం అదృష్టంగా భావిస్తున్నా. గుండ్రేవుల జలాశయం నిర్మిస్తే ఈ ప్రాంతం సస్యశామలం అవుతుంది. నాడు టీడీపీ ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విదేశి విద్యా పథకం పెడితే.. జగన వచ్చాక అంబేద్కర్ పేరు తొలగించిన జగన పేరు పెట్టుకున్నారు. దళిత సోదరులారా ఇప్పటికైనా మేల్కోండి.
ఫ కార్యకర్తలకు న్యాయం చేస్తాం
- కేఈ శ్యాంబాబు, పత్తికొండ ఎమ్మెల్యే
టీడీపీని నమ్ముకున్న కార్యకర్తలకు తప్పక న్యాయం జరుగుతుంది. పార్టీ మనకేమి ఇచ్చిందని కాదు.. పార్టీకి మనమేమి చేశామని ఆలోచించాలి. ప్రతి ఒక్కరికి పదవులు కావాలంటే కొంత సమయం పడుతుంది. పత్తికొండ నియోజకవర్గంలో ప్రతి పల్లెకు హంద్రీనీవా నీళ్లు ఇవ్వాలని నాడు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి రూ.128 కోట్లతో చెరువులు నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గంలో ప్రతి చెరువుకు హంద్రీనీవా ద్వారా చెరువులు నింపే బాధ్యత నాది.
ఫ స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
- కె.మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇనచార్జి
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాణాలొడ్డి కూటమి అభ్యర్థులను గెలిపించుకున్నాం. రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీగా టీడీపీ అభ్యర్థులను గెలించి అన్ని పదవుల్లో పసుపు జెండా ఎగురవేయాలి. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు ఆశయాల సాధనకు సామాన్య కార్యకర్తగా పని చేద్దాం. నిజమైన కార్యకర్తే టీడీపీ అసలైన నాయకుడు. తనకు ఎన్నో అవకాశాలు చేజారిపోయినా పార్టీ కోసం ఓ కార్యకర్తలా కృషి చేశాను.
ఫ కడప జనసంద్రం కావాలి
- గౌరు వెంకటరెడ్డి, నందికొట్కూరు టీడీపీ ఇనచార్జి
మహానాడు జన సమీకరణ కమిటీలో నేను సభ్యుడిని. రాయలసీమలో జరుగుతున్న ఈ సభను దిగ్వియం చేద్దాం. గత ఎన్నికల్లో టీడీపీ శ్రేణులు సమష్టి కృషితోనే అఖండ విజయం అందుకున్నాం. ఆ స్ఫూర్తితో వెల్లువలా మహానాడుకు తరలిరావాలి. కడప గడప జనసంద్రం కావాలి. జగన గుండెల్లో దడ పుట్టాలి.
ఫ వేదవతి నిర్మిస్తే ఆలూరు సస్యశామలం
- బి.వీరభద్రగౌడ్, ఆలూరు టీడీపీ ఇనచార్జి
ఆలూరు నియోజకవర్గాన్ని సస్యశామలం చేయాలని గతంలోనే సీఎం చంద్రబాబు నిధులు ఇచ్చి శంకుస్థాపన చేశారు. వైసీపీ అటకెక్కించారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే సాగు, తాగునీరు అందుతుంది. జగన విద్యుత కొనుగోళ్లు పేరిట భారీ దోపిడి చేశారు. 9 సార్లు విద్యుత చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారు.
ఫ చిన్న పరిశ్రమలు, లిఫ్టులు నిర్మించాలి
- ఎన.రాఘవేంద్రరెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇనచార్జి
మంత్రాలయం అంటే గుర్తుకొచ్చేది కరువు, వలసలు. వీటి నిర్మూలనకు ఎత్తిపోతల పథకాలు, చిన్న తరహా పరిశ్రమలు నిర్మించాలి. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి, ఉద్యోగాలు కల్పించాలి. ఏడాదిలో ఆరు నెలలే పనులు ఉంటాయి. మిగిలిన సమయంలో ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.
ఫ జనబలం ఉన్నవారికే పదవులు
- డి. విష్ణువర్ధనరెడ్డి, కేడీసీసీ బ్యాంక్ చైర్మన
టీడీపీకి కార్యకర్తలే బలం. గ్రామాల్లో కనీసం సర్పంచను గెలిపించుకునే జనబలం కలిగిన నాయకులకే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. కార్యకర్తలకు అండగా నిలిచే నాయకులకు చేయుత ఇవ్వాలి. కోడుమూరు నియోజకవర్గంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తాను. కోడుమూరు పట్టణానికి గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా పైపులైన వేసి తాగునీరు ఇస్తే శాశ్వతంగా చంద్రబాబును, టీడీపీని గుండెల్లో పెట్టుకుంటారు.
ఫ కష్టపడే వారికి గుర్తింపు
- సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కుడా చైర్మన
టీడీపీ గెలుపు గుర్రాలు కార్యకర్తలే. పని చేసే కార్యకర్తలు, నాయకులను అధిష్ఠానం గుర్తిస్తుంది. కష్టపడిన వారందరికి ఏదో ఒక పదవి రావాలని కోరుకుంటున్నాను. అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ ఆదేశాల మేరకు పార్టీని బలోపేతం చేద్దాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ ప్రభంజనం సృష్టిద్దాం.
Updated Date - May 22 , 2025 | 11:42 PM