అక్రమాలకు ఉపాధి..!
ABN, Publish Date - Jun 23 , 2025 | 11:40 PM
మహత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమార్కులకు అడ్డాగా మారింది.
రెండేళ్లలో సుమారుగా రూ.60 లక్షలు స్వాహా
చాగలమర్రిలో అత్యధికంగా రూ.4.5 లక్షలు
నిబంధనలకు విరుద్ధంగా జాబ్ కార్డులు
ఫీల్డ్ అసిస్టెంట్ల మాయాజాలం
ఫిర్యాదు చేసిన పట్టించుకోని ఏపీవోలు
నంద్యాల టౌన, జూన 23 (ఆంధ్రజ్యోతి): మహత్మాగాంఽధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అక్రమార్కులకు అడ్డాగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలను అదుకోవాలన్న ఉద్దేశంతో చేపట్టిన ఈ పథకంలో క్షేత్ర స్థాయిలో అవకతవకలు భారీగానే చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఏటా నిర్వహించే సామాజిక తనిఖీల్లో ఈ లోసుగులు బయటపడుతుండడం పరిపాటిగా మారింది. ఇటీవల నంద్యాల జిల్లాలో ఆడిట్ నిర్వహించగా భారీగానే అక్రమాలు బయటపడ్డాయి. నంద్యాల జిల్లాలో 27 మండలాలు ఉండగా ఇటీవల నిర్వహించిన ఆడిట్‌లో పలు విషయాలు ఫీల్డ్ అసిస్టెంట్‌లతో కలిసి టీఏలు, ఏపీవోలతో కలసి అక్రమాలకు పాల్పడినట్లు పీడీ కార్యాలయం అధికారులు చెబుతున్నారు. నిరుపేదలను వదిలిపెట్టి వారికి నచ్చిన వారికి జాబ్ కార్డులు కేటాయించుకున్నారు. అంతేకాకుండా వారు పనికి రాలేకపోయిన వారు వచ్చినట్లు రికార్డుల్లో నమోదు చేసుకుని స్వాహాపర్వానికి తెరతీశారు. కొలిమిగుండ్ల మండలంలో ఒక గ్రామంలో పని యంత్రాలతో చేయించి ఉదయం ఉపాధి కూలీలతో పని చేసినట్లు రాసి వారికి వచ్చిన మొత్తంలో సగం పీల్డ్ అసిస్టెంట్లు తీసుకున్నట్లు సమాచారం. అంతటితో ఆగని కొందరు ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్లు కలిసి డ్యూటీ సమయంలో ఓ పొలంలో మందు పార్టీ చేసుకుంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ‘అవినీతి చేసినా వారు మమ్మల్ని ఏమీ చేయలేరు. ఎన్ని కూలీలైనా రాసుకోండి మేం చేస్తాం. మీ జీబీ( డేటా సామర్థ్యం, రాసుకునే సామర్థ్యం) ఎక్కువ రాసుకోవచ్చు. మనసారు చేసేస్తారు. రాసుకున్న మీరేకదా విచారణకు వచ్చేది. ఏమీ కాదు మీకు నచ్చిన కూలీలు రాసుకోండి. అవసరమైతే యంత్రాలతో కూడా పనులు చేయించండి. జిల్లాలో మేం చెబుతాం...’ అని మద్యం తాగుతూ ఫీల్డ్ అసిస్టెంట్లు అనడం చర్చనీయాంశంగా మారింది. త
నిబంధనలకు విరుద్ధంగా జాబ్‌కార్డులు!
అధికారులు, ఉపాధి సిబ్బది నిర్వాకంతో తెలియని వారికి సైతం జాబ్‌కార్డులు మంజూరు చేయడం గమనార్హం. ఇటీవల కొంత మందికి జాబ్ కార్డులు అంటే కూడా తెలియని పరిస్థితి. ఆడిట్ సిబ్బంది జాబ్ కార్డు ఉందా? అని అడిగితే అది ఏం కార్డు అంటూ కొందరు చెప్పారు. దీంతో అఽధికారులు సైతం అవాక్కయ్యరు. కొలిమిగుండ్ల మండలంలోని పెట్నికోట గ్రామంలో ఉన్నవారి జాబ్ కార్డులు తీసేశారు. దీంతో వారు వెళ్లి అడగగా జాబ్ ఎక్కించాలన్న, సంక్షేమ పథకాలు అందాలన్నా ఒక్కొక్కరు రూ.2,500 ఇవ్వాలని ఫీల్డ్ అసిస్టెంట్లు డిమాండ్ చేస్తున్నారని పలువురు బాధిత కూలీలు ఆరోపించారు. నంద్యాల జిల్లాలో రోజుకు 49వేలమంది ఉపాధి కూలీలు పని చేస్తున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 489 గ్రామా పంచాయితీలు ఉన్నాయి. వీటిలో చాలా గ్రామాల్లో పనికి రాకపోయిన వచ్చినట్లు చూపించి కూలీలకు మస్టర్లు వేస్తున్నారు. వీటిలో ఎంబుక్‌లపై ఎంపీడీవో సంతకాలు లేకపోవడం విశేషం. తీర్మానాలు లేకుండా పనులు, కేవలం నాయకులు అండదండలతో చేయడం వంటి అక్రమాలకు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.28,80762 మేర అవినీతి జరిగినట్లు అధికారిక సమాచారం. అదేవిధంగా 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.30,72751 మేర అవినీతి జరిగింది. మొత్తంగా రూ.60 లక్షలు ఉపాధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులోకి వచ్చింది.
ఆడిట్‌లో బయటపడ్డ విషయాలు
ఫ ఆళ్లగడ్డ మండలం జి.జంబులదిన్నెకు చెందిన పీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల ప్రజలు ఉన్నతాఽధికారులకు ఫిర్యాదు చేయడంతో వారిపై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.
ఫ చాగలమర్రి మండలంలో జరిగిన ఆడిట్‌లో చాలా మంది ఉద్యోగులు అక్రమాలకు పాల్పడడంతో డిసెంబరులో ఐదుగురు సిబ్బందిని తొలగించారు.
ఫ మహానంది మండలంలో రూ.లక్ష వరకు ఉపాధి పనుల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. అయితే ఉపాధి సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని డ్వామా అధికారులు తెలిపారు.
ఫ డోనలో కూడా సుమారుగా రూ.2.5 లక్షలు అక్రమాలు జరగడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
ఫ బేతంచెర్లలో కూడా ఆడిట్ చేసినప్పుడు మూడు రోజుల పనికి వెళ్తే ఆరు రోజులు కూలీ వేసి మస్టర్లు వేయడంతో సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
విచారణకు ఆదేశించాం
- సూర్యనారాయణ, డ్వామా పీడీ, నంద్యాల జిల్లా
ఉపాధిలో జరిగిన అక్రమాల సమాచారం మా దృష్టికి వచ్చింది. కొలిమిగుండ్ల ఘటనపై క్లస్టర్ ఏపీడీ సాంబశివరావును విచారించి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించాం. వారి నుంచి నివేదికలు రాగానే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కూలీలు ఎక్కువ రాసుకున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. విచారించి వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం.
Updated Date - Jun 23 , 2025 | 11:40 PM