ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యుతశాఖ ఉద్యోగి నయా మోసం

ABN, Publish Date - May 30 , 2025 | 01:10 AM

చేపలు, రొయ్యల చెరువులు, గృహాలకు విద్యుత కనెక్షన్లు ఇచ్చే విషయంలో జూనియర్‌ లైన్‌మెన్‌ స్థాయి ఉద్యోగి ఒకరు పైఅధికారులనే బురిడీ కొట్టించాడు. విద్యుతశాఖ ఆదాయానికి నాలు గేళ్లుగా భారీ మొత్తంలో గండి కొట్టి, తన జేబు నింపు కున్నాడు. ఇటీవల విద్యుతశాఖ విజిలెన్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆశాఖ ఉన్నతాధికారులు సదరు జూనియర్‌ లైన్‌మేన్‌ చిప్పల ఉదయభానును సస్పెండ్‌ చేశారు. లోతైన విచారణకు ఆదేశించారు.

- చేపలు, రొయ్యల చెరువుల విద్యుత మీటర్లు ఇంటి వద్ద పెట్టుకుని నామమాత్రపు బిల్లులు జారీ

- నాలుగేళ్లుగా వ్యవహారం.. రూ.లక్షల్లో ప్రభుత్వ ఆదాయానికి గండి

- విద్యుతశాఖ విజిలెన్స్‌ అధికారుల దాడుల్లో బట్టబయలు

-సదరు ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ

చేపలు, రొయ్యల చెరువులు, గృహాలకు విద్యుత కనెక్షన్లు ఇచ్చే విషయంలో జూనియర్‌ లైన్‌మెన్‌ స్థాయి ఉద్యోగి ఒకరు పైఅధికారులనే బురిడీ కొట్టించాడు. విద్యుతశాఖ ఆదాయానికి నాలు గేళ్లుగా భారీ మొత్తంలో గండి కొట్టి, తన జేబు నింపు కున్నాడు. ఇటీవల విద్యుతశాఖ విజిలెన్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ విషయం వెలుగుచూసింది. దీనిపై తీవ్రంగా స్పందించిన ఆశాఖ ఉన్నతాధికారులు సదరు జూనియర్‌ లైన్‌మేన్‌ చిప్పల ఉదయభానును సస్పెండ్‌ చేశారు. లోతైన విచారణకు ఆదేశించారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

మచిలీపట్నం మండలం రుద్రవరం సచివాలయం ఉద్యోగి చిప్పల ఉదయభానును విద్యుతశాఖలో సిబ్బంది కొరత ఉండటంతో నాలుగేళ్ల కిందట జూనియర్‌ లైన్‌మేన్‌గా అధికారులు తీసుకున్నారు. రుద్రవరం, పరిసర ప్రాంతాల్లో ఇంటి అవసరాలకు విద్యుత మీటర్లు అందజేయడం, రొయ్యలు, చేపల చెరువులకు విద్యుత కనెక్షన్‌లు ఇవ్వడం, నెలనెలా చెరువుల వద్ద విద్యుత రీడింగ్‌ తీయడం వంటి పనులను ఉదయభానుకు అప్పగించారు. గతంలో విద్యుత పనులపై అవగాహన ఉన్న ఉదయభాను ఇదే అవకాశంగా తీసుకుని రొయ్యల చెరువుల యజమానులతో బేరం మాట్లాడుకున్నాడు. రొయ్యల చెరువుల వద్ద విద్యుత మీటర్లు కాలిపోయాయని, పనిచేయడం లేదనే కారణాలు చూపి తన ఇంటికి తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచే రొయ్యల చెరువులకు నామమాత్రపు బిల్లులు వచ్చేలా ప్రతినెలా బిల్లులు చేస్తూ వస్తున్నాడు. దీనిపై విద్యుతశాఖ విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు అందడంతో ఈ నెల 3వతేదీన అధికారులు రుద్రవరం పరిసర ప్రాంతాల్లోని రొయ్యల చెరువుల వద్ద తనిఖీలు చేశారు. చెరువుల యజమానులు విద్యుతను వాడుకుంటున్నా.. అక్కడ విద్యుత మీటర్లు లేవని గుర్తించారు. బిల్లులు ఎలా చేస్తున్నారని అధికారులు ఆరాతీస్తే.. అంతా ఉదయభాను చూసుకుంటున్నాడని రైతులు తెలిపారు.

ఉదయభాను ఇంటి వద్ద 18 విద్యుత మీటర్లు

విజిలెన్స్‌ అధికారులు ఉదయభాను ఇంటి వద్ద తనిఖీ చేయగా 18 విద్యుత మీటర్లు లభించాయి. ఈ విద్యుత మీటర్లను ఇంటి వద్దనే పెట్టుకుని రొయ్యల చెరువుల రైతుల పేరుతో నెలనెలా బిల్లులు మాత్రం ఇస్తున్నట్లుగా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఈ అంశంపై ప్రాథమిక విచారణ చేసిన విజిలెన్స్‌ అధికారులు విద్యుతశాఖ ఈఈ కార్యాలయంలో నివేదిక అందజేశారు. దీంతో ఉదయభానును సస్పెండ్‌ చేసినట్లు మచిలీపట్నం విద్యుతశాఖ ఈఈ కార్యాలయం అధికారులు తెలిపారు. ఈ అంశంపై ఇంకా విచారణ జరుగుతోందని, విచారణ పూర్తయిన తర్వాత పూర్తిస్థాయి నివేదికను తయారు చేస్తామని అధికారులు చెబుతున్నారు. రుద్రవరం, పరిసర ప్రాంతాల్లో రొయ్యల చెరువులకు విద్యుత మీటర్లు లేకుండా విద్యుతను సరఫరా చేసిన ఉదయభాను విద్యుతశాఖ ఆదాయానికి నెలనెలాలక్షల రూపాయల్లో గండికొట్టి, అనధికారికంగా ఆ నగదును కాజేశాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - May 30 , 2025 | 01:10 AM