సాగర..యోగా
ABN, Publish Date - Jun 04 , 2025 | 01:35 AM
అంతర్వేది, జూన్ 3(ఆంధ్రజ్యోతి): అంతర్వేది సాగ ర తీరం యోగాకు వేదికగా నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో మంగ ళవారం 4వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. తీరంలో ఎగసిపడుతున్న కెరటాల నడుమ సూర్యోదయ కిరణాల మధ్య 4వేల మంది సామూహిక యోగాసనాలు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీఆర్వో డి.రాజకుమారి, అమలాపురం ఆర్డీవో కె.మా
అంతర్వేది బీచ్‌లో యోగాంధ్ర కార్యక్రమం
4వేల మందితో యోగాసనాలు
పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు, ప్రజలు
అంతర్వేది, జూన్ 3(ఆంధ్రజ్యోతి): అంతర్వేది సాగ ర తీరం యోగాకు వేదికగా నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది బీచ్‌లో మంగ ళవారం 4వేల మందితో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన యోగాంధ్ర 2025లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. తీరంలో ఎగసిపడుతున్న కెరటాల నడుమ సూర్యోదయ కిరణాల మధ్య 4వేల మంది సామూహిక యోగాసనాలు చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, డీఆర్వో డి.రాజకుమారి, అమలాపురం ఆర్డీవో కె.మాధవి, డీఈవో షేక్ సలీంబాషా, డ్వామా పీడీ మధుసూదన్, నోడల్ ఆఫీసర్ రాజేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ శాంతకుమారి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్కే నవాజ్‌జాన్, జిల్లా అధికారులు, మాజీ సైనికులు, యువకులు, విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమం గంటన్నరపాటు సాగింది. యోగా గురువు పి.రామచంద్ర సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ధ్యానం, యోగాసనాలను వివరించారు. సుమారు 200 మంది సమన్వయంగా నిలబడి చేసిన వృక్షాసనం చూపరులను ఆకట్టుకుంది. జేసీ మట్లాడుతూ రోజు 10నిమిషాలైనా యోగా చేయడం వల్ల జీవితంలో మంచి మార్పులు వస్తాయన్నారు. కార్యక్రమానికి హాజరైన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ పూజా వేగేశ్నకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో డెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుబ్బల శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్ గుండుబోగుల పెద్దకాపు, దిరిశాల బాలాజీ, ముప్పర్తి నాని, గుబ్బల ఫణికుమార్, చాగంటి స్వామి, జిల్లా ఏసీ వి.సత్యనారాయణ తదితరులున్నారు.
Updated Date - Jun 04 , 2025 | 01:36 AM