ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రత్నగిరిపై యోగాంధ్ర

ABN, Publish Date - May 30 , 2025 | 11:47 PM

అన్నవరం, మే 30 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం కాకి నాడ జిల్లా అన్న వరం దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్ర మం నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, టూరిజం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చైతన్యవర్షిణి ముఖ్య అతిథులుగా

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, భక్తులు, ఉద్యోగులు

హాజరైన కాకినాడ జిల్లా జేసీ, టూరిజం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చైతన్యవర్షిణి

అధిక సంఖ్యలో పాల్గొన్న ఉద్యోగులు, భక్తులు, గ్రామస్థులు

అన్నవరం, మే 30 (ఆంధ్రజ్యోతి): అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం కాకి నాడ జిల్లా అన్న వరం దేవస్థానంలో యోగాంధ్ర కార్యక్ర మం నిర్వహించారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ మీనా, టూరిజం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ చైతన్యవర్షిణి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఉదయం 8గంటలకు ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు, భక్తులు, గ్రామస్థులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. జేసీ మాట్లాడుతూ యోగా ద్వారా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, నిత్యం యోగాసనాలు వేయడం ద్వారా నూతనుత్తేజం పొందుతారని పేర్కొన్నారు. ఆలయ ఈవో వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ ప్రాచీన భారతీయ సంప్రదాయం అమూల్యమైన సంపదగా యోగాను అభివర్ణించారు. చిన్నారులకు ఏకాగ్రత కల్పించడంలోను, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి యోగాసనాలు ద్వారా ఉపశమనం పొందవచ్చునన్నారు. దేవస్థానం వ్రతపురోహితులు, నాయిబ్రాహ్మణులు, శానిటరీ సిబ్బ ందితో పాటుగా సుమారు 1000 మంది యోగసనాలను వేశారు.

Updated Date - May 30 , 2025 | 11:47 PM