ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆరోగ్యయోగమే!

ABN, Publish Date - May 22 , 2025 | 01:04 AM

జీవన విధా నంలో యోగా సాధనను ఒక భాగంగా చేసుకుంటే చాలా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు.

ఉపయోగం : గౌతమి ఘాట్‌లో యోగాసనాలు వేసిన మంత్రి దుర్గేష్‌, కలెక్టర్‌ ప్రశాంతి, ఎస్పీ నరసింహ కిశోర్‌ ఇతర ఉద్యోగులు

రాజమహేంద్రవరం, మే 21 (ఆంధ్రజ్యోతి): జీవన విధా నంలో యోగా సాధనను ఒక భాగంగా చేసుకుంటే చాలా అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని మంత్రి కందుల దుర్గేష్‌ పేర్కొన్నారు. గౌతమి ఘాట్‌లో బుధవారం యోగా మాసోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు యోగా సాధనపై ‘యోగాంధ్ర-2025’ నినాదంతో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. వచ్చే నెల 21న విశాఖ పట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌ యోగా మాసోత్సవానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేశారన్నారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా ప్రభుత్వం ఐదుగురు మం త్రులతో ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్‌ కమిటీలో తాను ఒక సభ్యుడినని చెప్పారు. కమిటీ ద్వారా రానున్న రో జుల్లో యోగా అభ్యసన దిశగా అద్భుతమైన కార్య క్రమాలు నిర్వహిస్తామన్నా రు. యోగా మాసోత్సవాల్లో ప్రజలు పాల్గొనాలని కోరారు. కలెక్టర్‌ ప్రశాంతి మాట్లా డుతూ ఆరోగ్యకర జీవనానికి యోగా ఆవశ్యకమన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ నరసింహ కిశోర్‌,జేసీ చిన్న రాముడు, కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌,అదనపు ఎస్పీ మురళీకృష్ణ,ఆర్డీవో కృష్ణ నాయక్‌, డీఎస్పీ భవ్య కిశోర్‌,సీపీవో ఎల్‌.అప్పలకొండ తదితరులు యోగాసనాలు వేశారు.

Updated Date - May 22 , 2025 | 01:04 AM