ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఏలేరు’లో భారీగా తగ్గిన నీటి నిల్వలు

ABN, Publish Date - May 15 , 2025 | 12:28 AM

ఏలేశ్వరం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు భారీగా త గ్గుతున్నాయి. ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియో జక వర్గాల పరిధిలో సుమారు 60వేల ఎకరాలు వ్యవసాయ భూములున్నాయి

ఏలేరు జలాశయంలో తగ్గిన నీటి మట్టం

ఏలేశ్వరం, మే 14 (ఆంధ్రజ్యోతి): ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాకినాడ జిల్లా ఏలేరు జలాశయంలో నీటి నిల్వలు భారీగా త గ్గుతున్నాయి. ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియో జక వర్గాల పరిధిలో సుమారు 60వేల ఎకరాలు వ్యవసాయ భూములున్నాయి. సాగుకు పూర్తిగా సరఫరా నిలిపి వేసి విశాఖ మహానగరం అవసరాలకు జలాలను సరఫరా చేస్తున్నారు. దీంతో ఏలేరులోని దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 86.56 మీటర్లు కాగా శనివారం 76.51 మీటర్లుగా నమోదైంది. పూర్తిస్థాయి నిల్వల సా మర్థ్యం 24.11 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 9.71 టీఎంసీల మేర మాత్రమే నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం విశాఖకు 200 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఏలేశ్వరం గ్రామీణ మండలాల్లో ఏలేరు జలాలనే శుద్ధి చేసి తాగునీటిగా అందిస్తున్నారు. ప శువుల తాగునీటి అవసరాలకు కాలువలకు అ ప్పుడప్పుడు నీటిని విడుదల చేస్తారు. ఎండలు మరింత అధికమైతే నీరు ఆవిరి అయిపోవడంతో నిల్వలపై ప్రభావం చూపుతోంది.

ఖరీఫ్‌ సాగుపై రైతుల ఆందోళన

ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాలకు సాగు నీరందించే తిమ్మరాజు చెరువు అడుగంటడంతో ఖరీఫ్‌ సాగుపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏలేరు జలాశయం నుంచి సుమారు 50 నుంచి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తా రు. దీనిలో అర టీఎంసీ నీరు నిల్వ ఉంటుంది. చెరవు నుంచి వచ్చే నీటి ద్వారా సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందిచవచ్చు. కానీ పొలాలకు నీరందించే కాలువలో పూడిక, తుప్ప లు తొలగించకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల్లోను, ఇళ్ల మధ్యలోను ఎక్కడిక్కడ నీరు ఉండి పోవడంతో చెరువులోని నీరు పొలాలకు చేరకు ండా మధ్యలో ఆగిపోతుంది. ఖరీఫ్‌ సాగు ముం దు కాలువలను శుభ్రం చేసి పొలాలకు నీరం దేలా తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - May 15 , 2025 | 12:28 AM