సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా మాయమాటలు
ABN, Publish Date - Jul 08 , 2025 | 12:56 AM
గొల్లప్రోలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా మాయమాటలు చెప్పేవారిని మోసగాళ్లని కాకుండా ఏ మని పిలవాలని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫ ంక్షన్ హాలులో సోమవారం కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన పిఠాపురం నియోజకవర్గ వైసీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయకపో
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం
పవన్‌ను ప్రజలు నిలదీయాలి
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
గొల్లప్రోలు, జూలై 7 (ఆంధ్రజ్యోతి): సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయకుండా మాయమాటలు చెప్పేవారిని మోసగాళ్లని కాకుండా ఏ మని పిలవాలని మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలులోని సత్యకృష్ణ ఫ ంక్షన్ హాలులో సోమవారం కాకినాడ మాజీ ఎంపీ వంగా గీతావిశ్వనాథ్ ఆధ్వర్యంలో జరిగిన పిఠాపురం నియోజకవర్గ వైసీపీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ హామీలు అమలు చేయకపోవడంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ను ప్రజలు నిలదీయాలన్నారు. వాటిపై అడిగితే మక్కెలు విరగకొడతాం, తాటలు తీస్తామని బాబు,పవన్ అంటున్నారని.. ప్రజల్లో తిరిగితే ఎవరి మక్కెలు విరగగొడతారో తెలుస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఉద్యోగం ఇవ్వలేకపోయారని విమర్శించారు. చంద్రబాబు ఎప్పు డు అధికారంలోకి వచ్చినా ప్రజలు మోసపోతారని.. చంద్రబాబు వంద చెబితే, లోకేశ్ రెండు వందల అబద్దాలు చెబుతాడని ఎద్దేవా చేశారు. కూటమి ఇచ్చే హామీలు అమలు చేసే బాధ్యత తనదని, ఎన్నికల ముందు చెప్పిన పవన్ ఇప్పు డు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించా రు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ చంద్రబాబు ను సీఎంగా చూడాలనుకునే పవన్‌ను హీరోగా భావించడం మన ఖర్మన్నారు. ఎమ్మెల్యే అయిన పవన్ పిఠాపురం ఎన్నిసార్లు వచ్చాడని, ఆయ నకు ప్రజా సమస్యల పట్టించుకునే తీరిక ఉం దా అని ప్రశ్నించారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ మంత్రి తోట నరసింహం, నేతలు ముద్రగడ గిరిబాబు, దవులూరి దొరబాబు, యనమల కృష్ణుడు ఉన్నారు.
Updated Date - Jul 08 , 2025 | 12:56 AM