ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిర్లక్ష్యంగా పనిచేస్తే.. జీతాలు ఆపండి

ABN, Publish Date - May 13 , 2025 | 01:04 AM

గృహ నిర్మాణ పనుల వేగవంతానికి కార్యా చరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదే శించారు. వివిధ అంశాలపై ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఇళ్ల నిర్మా ణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల న్నారు. డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అదనపు రుణ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు.

అధికారులతో సమీక్షిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి
  • ఇక ప్రతి శనివారం హౌసింగ్‌డే

  • కలెక్టర్‌ ప్రశాంతి సమీక్ష

రాజమహేంద్రవరం, మే 12 (ఆంధ్రజ్యోతి): గృహ నిర్మాణ పనుల వేగవంతానికి కార్యా చరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ ప్రశాంతి ఆదే శించారు. వివిధ అంశాలపై ఆమె సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఇళ్ల నిర్మా ణాలు త్వరితగతిన పూర్తి చేయడానికి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల న్నారు. డీఆర్‌డీఏ, మెప్మా ఆధ్వర్యంలో అదనపు రుణ సదుపాయాన్ని కూడా కల్పించామన్నారు. ప్రతి శనివారం హౌసింగ్‌ డే నిర్వహించి లబ్ధిదారులతో మమేకం కావాలన్నారు. గృహ నిర్మాణ పనుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవ హరించే వారి జీతాలు నిలుపుదల చేయాలని ఆదేశించారు.ఉపాధి హామీ పథకం కింద ఫామ్‌ పాండ్‌లను వర్షాకాలం వచ్చేలోపుగా పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులకు అండగా నిలిచే క్రమంలో జిల్లాకు ఈ ఖరీఫ్‌ సీజన్‌కు 1.10 లక్షల సీసీఆర్సీ కార్డులు లక్ష్యంగా ఇచ్చా రన్నా రు.ఈ-క్రాప్‌ బుకింగ్‌, అడంగల్‌ను అనుసరించి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులను జారీ చే యాల్సి ఉంటుందని చెప్పారు.వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో క్షేత్రస్థాయి అధి కా రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. జేసీ చిన్న రాముడు మాట్లాడుతూ వీడియో కాన్ఫ రెన్స్‌కు హాజరుపై ఆర్డీవోలు నిర్ధారణ చేసుకోవాలన్నా రు.ఎవరైనా తహశీల్దార్‌ పనితీరులో అలసత్వం గా ఉంటే సంబంధిత ఆర్డీవో బాధ్యత వహిం చాల్సి వస్తుందని స్పష్టం చేశారు. రీ సర్వే, స్వామిత్ర సర్వే పనుల విషయంలో నాణ్యత ప్రమాణాలు పా టించాలన్నారు. రబీ ధాన్యం లక్ష్యాలు పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు.

Updated Date - May 13 , 2025 | 01:04 AM