ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కొడుకు ఊపిరి ఆపి.. చున్నీతో ఉరేసుకుని..

ABN, Publish Date - Jun 05 , 2025 | 12:45 AM

కాకినాడ క్రైం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అభం, శుభం తెలియని నాలుగేళ్ల కొడుకు నోరు, ము క్కుకు పార్సిల్స్‌కు వేసే ప్లాస్టర్‌ను బిగించి ఊపి రాడకుండా చేసి చనిపోయిన తరువాత తల్లి కూ డా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం కాకినాడలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి.

కాకినాడలో మహిళ బలవన్మరణం

కుటుంబ సమస్యలతో నిర్ణయం

కాకినాడ క్రైం, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): అభం, శుభం తెలియని నాలుగేళ్ల కొడుకు నోరు, ము క్కుకు పార్సిల్స్‌కు వేసే ప్లాస్టర్‌ను బిగించి ఊపి రాడకుండా చేసి చనిపోయిన తరువాత తల్లి కూ డా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని ఆత్మ హత్యకు పాల్పడిన సంఘటన బుధవారం కాకినాడలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వ రపురానికి చెందిన రమ్యదీప్తి (30)కి కాకినాడ రేచర్లపేట దౌర్ల వారి వీధికి చెందిన రాజాల శరత్‌బాబుతో 5ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి నాలుగేళ్ల కుమారుడు సియాన్‌ ప్రశాంత్‌ ఉన్నాడు. కాగా భార్య భర్తలిద్దరూ కొంతకాలం క్రితం ఉపాధి నిమిత్తం కొడుకుతో పాటు గల్ఫ్‌లోని అబుదబిలో ఉన్నారు. అయితే శరత్‌బాబుకు అక్కడ నుంచి వేరే చోటకు ట్రాన్స్‌ఫర్‌ అవ్వడంతో ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎం దుకు ఇండియాకు వెళ్లిపోమ్మని భార్యకు చెప్పడంతో రమ్యదీప్తి కొడుకుని తీసుకుని 2 నెలల క్రితం ఇండియాకు వచ్చి సీతానగరంలోని అమ్మగారి ఇంటికి వెళ్లింది. అక్కడ నుంచి 10 రోజు ల క్రితం కాకినాడ రేచర్లపేటలో ని అత్తగారింటికి వచ్చింది. అయి తే ఎంఎస్సీ చదివిన రమ్యదీప్తిని అత్త శాంతి, ఆడపడుచు మెర్సీ కలసి ఇంత చదువుకుని ఖాళీగా ఏం చేస్తా వ్‌ గల్ఫ్‌ వెళ్లి సంపాదించు అంటూ ప్రతిరోజు మానసికంగా వేధిస్తుండడంతో తట్టుకోలేక తీవ్ర మనస్తాపానికి గురైంది. మంగళవారం అర్ధరాత్రి దాటాక తలుపులు గడియ పెట్టుకుని కొడుకుకు ఊపిరాడ కుండా నోరు, ముక్కుకి ప్లాస్టర్‌ వేసి చనిపోయాడని నిర్ధారించుకున్నాక తాను కూడా ఫ్యాన్‌కు చున్నీతో ఉరేసుకుని విగత జీవురాలైంది. ఉదయం 8 అయినా తలుపులు తీయకపోయేసరికి అత్త, ఆడపడుచుకు అనుమానం వచ్చి కిటికీ గుండా చూసేసరికి తల్లీకొడుకులు విగతజీవులు గా ఉండడాన్ని గమనించారు. అనంతరం స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లి గుడేటి అరు ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇన్‌చార్జ్‌ సిఐ కెవి సత్యనారాయణ సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. టూటౌన్‌ పో లీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jun 05 , 2025 | 12:45 AM