పహల్గాం ఘటనలో ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు
ABN, Publish Date - May 22 , 2025 | 01:06 AM
దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని పెహల్గాంలో జరిగిన దారుణ ఘటనకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రధానమంత్రి మోదీ వైఫల్యం చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఆహ్వానకమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.
ఏఐసీసీ ఆహ్వానకమిటీ సభ్యుడు గిడుగు
అమలాపురం, మే 21(ఆంధ్రజ్యోతి): దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లుతుందని పెహల్గాంలో జరిగిన దారుణ ఘటనకు బాధ్యులైన టెర్రరిస్టులను పట్టుకోవడంలో ప్రధానమంత్రి మోదీ వైఫల్యం చెందారని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ ఆహ్వానకమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. అమలాపురంలోని ఆయన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్, పెహల్గాం ఘటనలపై వాస్తవాలను వివరించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటు సమావేశాలు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. టెర్రరిస్టులను పట్టుకోవడంలో వైఫల్యం చెందిన ప్రధాని మోదీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని గిడుగు ఆరోపించారు. అఖిలపక్ష ఎంపీలను విదేశీ టూర్లకు పంపించి ఉగ్రవాద చర్యలను వివిధ దేశాలకు వివరించాలన్న ప్రధాని, ముందుగా ఇక్కడ ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
Updated Date - May 22 , 2025 | 01:06 AM