ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇదేమి కాలం!

ABN, Publish Date - May 04 , 2025 | 01:05 AM

ఒక పక్క తీవ్రమైన ఎండ.. ఉదయం ఏడు నుంచే నడినెత్తిన సూర్యుడి ప్రతాపం.. బయటకు రావాలంటేనే ఎండవేడికి ఉక్కబోత..చెమటలతో తడిచి ముద్దవుతున్న పరిస్థితి.. మరో పక్క అంత ఎండతో ఆపసోపాలు భరి స్తోన్న ప్రజలకు సాయంత్రం అయ్యేసరికి ఒక్క సారిగా వరుడి కరుణతో ఉపశమనం.. చిరుజల్లు ల నుంచి కుండపోత వానతో చల్లబ డుతోన్న వాతావరణం.. ఒకపక్క ఈదురుగాలులు..

  • కరుణ చూపిన వరుణుడు..

  • వాతావరణంలో పెనుమార్పులు

  • ఉదయం ఎండ.. సాయంత్రం వాన

  • 4 రోజులుగా విస్తారంగా వర్షాలు

  • శనివారం కాకినాడలో అత్యధికం

  • సాధారణస్థితికి వర్షపాతం

  • ఆశ్చర్యపోతున్న అధికారులు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)

ఒక పక్క తీవ్రమైన ఎండ.. ఉదయం ఏడు నుంచే నడినెత్తిన సూర్యుడి ప్రతాపం.. బయటకు రావాలంటేనే ఎండవేడికి ఉక్కబోత..చెమటలతో తడిచి ముద్దవుతున్న పరిస్థితి.. మరో పక్క అంత ఎండతో ఆపసోపాలు భరి స్తోన్న ప్రజలకు సాయంత్రం అయ్యేసరికి ఒక్క సారిగా వరుడి కరుణతో ఉపశమనం.. చిరుజల్లు ల నుంచి కుండపోత వానతో చల్లబ డుతోన్న వాతావరణం.. ఒకపక్క ఈదురుగాలులు.. మరోపక్క కూలుతోన్న విద్యుత్‌ స్తంభా లు.. నేలకొరుగుతున్న చెట్లతో విచిత్ర పరిస్థితులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నెల కొన్నాయి. మండువేసవితో అల్లాడించే ఏప్రిల్‌, మేనెలల్లో గడ చిన కొన్నిరోజులుగా భారీ వర్షాలు జిల్లాను ఊపేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఉదయం తీవ్రమైన వేడి.. సాయంత్రం అయ్యేసరికి భారీ వర్షాలతో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నా యి. ఉమ్మడి జిల్లాలో శనివారం అనేక చోట్ల 38 డిగ్రీలకుపైగా ఎండ చుక్కలు చూపిం చగా..మధ్యాహ్నం దాటేసరికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉన్నట్టుండి కుండ పోతగా వాన.. ఈదురుగాలులు.. బీభత్సం సృష్టించాయి. కాకినాడ రూరల్‌లో అయితే ఏకంగా రాష్ట్రంలోనే అత్యధికంగా 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాకినాడ నగరంలో రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి వాన నీరు వచ్చేసింది. అటు కోటనందూరులో 2.7, కిర్లంపూడి 2.1, తుని 2.25, తాళ్లరేవు,శంఖవరం,రౌతులపూడి,గొల్లప్రోలు, పిఠాపురం, పెదపూడి మండలాల్లో 1.7, తూర్పుగో దావరి జిల్లా రంగంపేట 2.75, గోపాలపురంలో 0.25 మి.మీ. వర్షపాతం నమోదైంది. ప్రధానంగా తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాలతో పోల్చితే కాకినాడ జిల్లాలో గడచిన రెండువారాలుగా వర్షాలు అనేక మండలాల్లో దంచికొడుతున్నాయి. ఏకంగా భారీ ఈదురు గాలులు, కుండపోత వర్షం కురుస్తుండడం విశేషం. ఇటీవల అన్నవరంలో కురిసిన భారీ వర్షానికి ఆలయ మెట్లపై ధారలా వాననీరు ప్రవహించింది. శనివారం సైతం జిల్లాలో అనేక మండలాల్లో వానకుతోడు ఈదు రుగాలులు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా కిర్లం పూడి, ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో అయితే ఏకంగా చెట్లు, విద్యుత్‌ స్తంబాలు కొన్నిరోజులుగా గాలివానకు పడుతూనే ఉన్నాయి.

లోటు నుంచి...

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత నెల ఏప్రిల్‌లో కురిసిన వర్షాలు జిల్లాను లోటు నుంచి సాధారణ వర్షపాతం స్థాయికి తీసుకొచ్చాయి. వాస్తవానికి అంతకుముందు మార్చి నెలలో ఉమ్మడి జిల్లా లోటు వర్షపాతం జాబితాలో ఉంది. కాకినాడ జిల్లాలో మార్చి నెలలో సాధారణ వర్షపాతం 12.49 సెంటిమీటర్లు కురవాల్సి ఉంటే 0.82 సెం.మీతో లోటులో ఉంది. కోనసీమ జిల్లాలో 12.02 సెం.మీ.కు సున్నా వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 15.18 సెం.మీకు 0.04 మి.మీ కురిసింది. ఏప్రిల్‌ నెలలో కాకినాడ జిల్లాలో 16.4 సెం.మీ. వర్షం కురవాల్సి ఉంటే ఏకంగా 45.81 సెం.మీ వర్షపాతం నమోదైంది. కోన సీమ జిల్లాలో 10.52 సెం.మీ.కు 20.17 సెం.మీ. కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 16.73 సెం.మీ.కు 47.49 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఒకరకంగా ఈనెలలో ఈస్థాయిలో వర్షపాతం నమోదవడం అరుదని వాతావరణ శాఖాధికారులు వివరించారు.

Updated Date - May 04 , 2025 | 01:05 AM