సార్వాకైనా నీళ్లొచ్చేనా!
ABN, Publish Date - May 11 , 2025 | 01:16 AM
20 ఏళ్లుగా నీరందిస్తున్న చాగల్నాడు పంట కాలువ రంగంపేట, గండేపల్లి మండలాల మధ్య మాయమై 20 నెలలు కాగా ఇప్పుడు మోక్షం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2004లో రూ.80 కోట్ల వ్య యంతో చాగల్నా డు ఎత్తిపోతల ప థకాన్ని నిర్మించా రు. ఈ పథకం ద్వారా ఏడు మం డలాలకు చెందిన 35000 ఎకరాలకు సాగునీరు అందవలసి ఉండగా అందులో ఒక రంగంపేట మండలానికే 14000 ఎకరాలు కేటాయించారు. ఇందు లో భాగంగా వడిశలేరు నుంచి మర్రిపూడి వ రకు 21 కిలో మీటర్ల ప్రధాన పంట కాలువను తవ్వారు.
పూడ్చిన చాగల్నాడు పంట కాలువ తెరుచుకొనేనా?
చండ్రేడు, నాయకంపల్లి గ్రామాల మధ్య 500 మీటర్లు పూడ్చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
ఐదు గ్రామాల రైతులకు పంట నష్టం
కాలువ పునరుద్ధరణకు 20 నెలలుగా పోరాటం
రంగంపేట, మే 10 (ఆంధ్రజ్యోతి): 20 ఏళ్లుగా నీరందిస్తున్న చాగల్నాడు పంట కాలువ రంగంపేట, గండేపల్లి మండలాల మధ్య మాయమై 20 నెలలు కాగా ఇప్పుడు మోక్షం దిశగా అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి 2004లో రూ.80 కోట్ల వ్య యంతో చాగల్నా డు ఎత్తిపోతల ప థకాన్ని నిర్మించా రు. ఈ పథకం ద్వారా ఏడు మం డలాలకు చెందిన 35000 ఎకరాలకు సాగునీరు అందవలసి ఉండగా అందులో ఒక రంగంపేట మండలానికే 14000 ఎకరాలు కేటాయించారు. ఇందు లో భాగంగా వడిశలేరు నుంచి మర్రిపూడి వ రకు 21 కిలో మీటర్ల ప్రధాన పంట కాలువను తవ్వారు. నీటి సరఫరాలో ఒడిదుడుకులు ఉన్నా ఎనిమిది గ్రామాలకు ఉపయోగపడే ఈ కాల్వను 2023లో చండ్రేడు -నాయకంపల్లి గ్రామాల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు 500 మీటర్ల పొడవునా 10 మీటర్ల వెడల్పున పంట కాలువను పూడ్చివేసి పంట భూమిగా మార్చి వేశారు. దీని వల్ల కాలువ దిగువ గ్రామాలైన కోటపాడు, వెంకటాపురం, దొడ్డిగుంట, సింగంపల్లి, మర్రిపూడి గ్రామాలకు సాగునీరు నిలిచిపోయింది. అటు చా గల్నాడు అధికారులు ఇటు వివిధ గ్రామాల రైతులు 20 నెలలుగా కా లువ పునరుద్ధరణకు పోరాటం చేస్తూనే ఉన్నారు. కాలువ పూడ్చి వేసిన భూమి గండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామానికి చెందినది కావడంతో పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణి సమగ్ర నివేదిక మేరకు కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ అక్రమార్కులపై చర్యలకు ఆదేశిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. జూలైలో సార్వా పంట కాలం నాటికి కాల్వను పూర్తిస్థాయిలో పునరుద్ధరించాలని, నష్టపోయిన రంగంపేట మండలానికి చెందిన ఐదు గ్రా మాల రైతులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై కాలువ పూడ్చి వేసిన వారిపై గండేపల్లి మండల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయినట్టు తెలిసింది. ఇటు చాగల్నాడు అధికారులు, అటు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలి యవచ్చింది. కాగా జూలై మొదటి వారంలో చాగల్నాడు కాలువకు నీరు విడుదల చేయనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. అయితే అప్ప టికైనా పూడ్చిన పంట కాలువను తెరిచి నీరందించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
Updated Date - May 11 , 2025 | 01:16 AM