ఉపాధి హామీ.. ఏది సామీ!
ABN, Publish Date - Jun 03 , 2025 | 12:48 AM
ఉపాధిహామీ శ్రామికులు గత రెండు నెలలుగా పనులు చేసినా ఇంత వరకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి పనులకు చెల్లింపులు లేకపోవడంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ వేతన బిల్లులు రావపోవడంతో ఏం తినాలి... ఎట్లా బతకాలి అంటూ వాపోతున్నారు.
ఉపాధిహామీ శ్రామికులు గత రెండు నెలలుగా పనులు చేసినా ఇంత వరకు వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని వారికి పనులకు చెల్లింపులు లేకపోవడంతో పూట గడవని పరిస్థితి ఏర్పడింది. నెలలుగా ఉపాధి పనులు చేస్తున్నప్పటికీ వేతన బిల్లులు రావపోవడంతో ఏం తినాలి... ఎట్లా బతకాలి అంటూ వాపోతున్నారు.
ఏం తినాలి.. ఎట్లా బతకాలి
విలీన మండలాల్లో 2నెలలుగా ఉపాధి హామీ శ్రామికులకు అందని వేతనాలు
ఆర్థిక ఇబ్బందులతో గగ్గోలు
పనుల కోసం తెలంగాణ వైపు అడుగులు
ఎటపాక, జూన్ 2 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాం తంలోని నాలుగు విలీన మండలాల్లో 28,489 మంది ఉపాధి జాబ్ కార్డులు కలిగి ఉన్నారు. ప్రస్తుతం 52,135 శ్రామికులు పనులు చేస్తున్నారు. ఉపాధి పనుల్లో బాగంగా నీటి కుంటలు, ఇంకుడుగుంతలు, భూమి చదును, సరిహద్దు కందకాలు, పశువుల నీటి తొట్టెలు, పంట కాల్వలు తదితర పనులు నిర్వ హిస్తున్నారు. ఉపాధి హామీ చట్టం ప్రకారం పనులు చేసిన 15 రోజుల్లో శ్రామికులకు వేతనాలు చెల్లిం చాల్సి ఉంటుంది. కానీ పనులు చేసి రెండు నెలలు పూ ర్తవుతున్నా ఇప్పటివరకు వేత నాలు చెల్లించని దుస్థితి ఉంది.
రూ.9 కోట్ల బకాయిలు..
గత 2 నెలలుగా పనులు చేసిన ఉపాధిహామీ శ్రామి కులకు వేతనాలు జమ అవడంలేదు. అయితే మార్చి వరకు శ్రామికులకు వేతనా లు ఖాతాల్లో జమ అయ్యాయి. ఏప్రిల్, మేనెలల్లో చేసిన పనులకు వేతన బకాయిలు జమకావాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు బకాయిలు రావాల్సి ఉంది. 2 నెలలుగా వేతనాలు విడుదల కాకపోవడంతో శ్రామి కులు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారు. విలీన మండలాల్లో రెండు నెలల పనులకు గాను ఉపాధి శ్రామికులకు మొత్తం సుమారు రూ.9.కోట్ల వరకు బకాయి వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి.
వేసవి అలవెన్స్ నిలిపివేత..
వేసవిలో ఉపాధి పను లు చేయడం కష్టంగా ఉం టుందని భావించిన ప్రభుత్వా లు గతంలో ఉపాధి పనుల సమ యాల్లో ఫిబ్రవరి నెలలో 20శాతం, మార్చిలో 25శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30శాతం, జూన్‌లో 20 శాతం వరకు పనుల పరిమాణం తగ్గించి 100 శా తం పనికి వేతనం అందించేవారు. వేసవిలో నెల గట్టిగా ఉండడంతో పని తక్కువ జరిగినా వేసవి అలవెన్స్‌తో కలిపి వేతనం అందించేవారు. అయితే ఈ ఏడాది శ్రామికులకు వేసవిలో ఇవ్వాల్సిన అల వెన్స్‌ను నిలిపివేశారు. దాంతో ఈ ఏడాది వేతనాలు తగ్గే అవకాశంఉందని గగ్గోలు పెడుతున్నారు.
పనుల కోసం వలసలు..
ఈ ఏడాది వ్యవసాయ పనులు అంతంత మాత్ర ంగా ఉండడం, ఉపాధి పనుల వేతనాలు సకాలంలో రాకపోవడంతో చాలామంది ఇటీవల తెలంగాణలోని భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెంకు వలస వెళ్తు న్నారు. అక్కడ తాపీ పనులతోపాటు హోటళ్లు, షా పుల్లో రోజు వారి పనులకు వెళ్లి వస్తున్నారు. గ్రామా ల్లో పనులు లేకపోవడంతో ఈ దుస్థితి వచ్చింది.
Updated Date - Jun 03 , 2025 | 12:48 AM