గ్రామాలకు సురక్షిత తాగునీరు
ABN, Publish Date - Jul 23 , 2025 | 01:16 AM
గ్రామా ల్లో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవా రం మండలం వడిశలేరు గ్రామంలోని ఊరచెరువు గట్టుపై 15వ ఆర్థిక సంఘ నిధులతో రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా అభివృద్ధి చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీటి సరఫరా పథకాన్ని నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.
వడిశలేరు పర్యటనలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
రంగంపేట, జూలై 22(ఆంధ్రజ్యోతి): గ్రామా ల్లో సురక్షితమైన తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవా రం మండలం వడిశలేరు గ్రామంలోని ఊరచెరువు గట్టుపై 15వ ఆర్థిక సంఘ నిధులతో రక్షిత మంచినీటి సరఫరా పథకం ద్వారా అభివృద్ధి చేసిన వాటర్ ప్లాంట్ ద్వారా మంచినీటి సరఫరా పథకాన్ని నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జలజీవన్ మిషన్ ద్వారా అన్ని గ్రామాల్లో మంచినీటి కొరత లేకుండా కృషి చేస్తున్నామన్నారు. గ్రామాల అభివృ ద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. అంతకుముందు సుపరిపాలనలో తొలి అడుగు కార్య క్రమంలో భాగంగా గ్రామంలో ఎమ్మె ల్యే నల్లమిల్లి, మనోజ్‌రెడ్డి పర్యటించా రు. ఇంటింటికీ వెళ్లి ఏడాది కాలంలో వడిశలేరులో రూ.12.58 కోట్లతో చేసిన అభివృద్ధి, సంక్షే మ పథకాలను వివరించి కరపత్రాలను అందజేశారు. అలాగే వడిశలేరు చేనేత క్లస్టర్ సభ్యుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కృ షి చేస్తోందన్నారు. కార్యక్రమాల్లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవిందు, నీలపాల త్రి మూర్తులు, ఎలుగుబంటి సత్తిబాబు, ఉద్దండ్రా వు శ్రీను, కొమ్మన రాంబాబు, పోతుల వెంకటరావు, అడబాల వెంకటరావు, మాచిన వెంకన్నదొర, చావ శ్రీనివాస్, యు.బుల్లిదొర పాల్గొన్నారు.
జాబ్ మేళాను వినియోగించుకోవాలి
అనపర్తి, జూలై 22(ఆంధ్రజ్యోతి): అనపర్తిలో ఈనెల 26న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వ ర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కోరారు. మంగళవారం రామవరంలో ఆయన జాబ్‌మేళా పోస్టర్‌ను ఆవి ష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ మేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, సుమారు 900 ఉద్యోగావకాశాలు లభించే వీలుందని, పదో తరగతి ఆపై చదువుకున్న వారందరూ వినియోగిచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2025 | 01:16 AM