గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
ABN, Publish Date - May 04 , 2025 | 11:55 PM
కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఇంది రా కాలనీ వద్ద ఎర్రకొండపై రూ.2.35 కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు.
ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి
పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
ధవళేశ్వరం, మే 4(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తూ సీసీ రోడ్లు, డ్రైన్లు, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెడుతోందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఇంది రా కాలనీ వద్ద ఎర్రకొండపై రూ.2.35 కోట్లతో ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం పోలీస్‌స్టేషన్ నుంచి రామపాదాల రేవు వరకు, ఉడతా వారి వీధిలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నియోజకవర్గంలోని గ్రామాల్లో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ధవళేశ్వరంలో జలజీవన్ మిషన్‌లో భా గంగా గోదావరి నీటిని కుళాయిల ద్వారా ఇంటింటికి అందిం చడానికి ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు నిర్మి స్తున్నామని, త్వరలోనే గ్రామంలో అవసరమైన సీసీ డ్రైన్ల నిర్మాణం పూర్తి చే స్తామని హామీ ఇచ్చారు. మధ్యలోనే నిలిచిపోయిన ప్రధాన మురుగుడ్రైన్, ఊర కాలువను అభివృద్ధి చేయడానికి అంచనాలు రూపొందించడానికి అధికారులను ఆదేశించారు. పుష్కరాలు నాటికి గోదావరి బండ్ రోడ్డును, ఘాట్లను అభివృద్ధి చేసి సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. చిన్నచిన్న అభివృద్ధి పనులను ప్రభుత్వంపై ఆధారపడకుండా స్థానికులు ముందుకు వచ్చి చేసుకోవాలన్నారు. దీంతో లైటింగ్ పనులకు కాంట్రాక్టర్ సుబ్బరాజు రూ.2లక్షలను ప్రకటించారు. ట్రీట్‌మెంట్ ప్లాంట్ నిర్మాణం రూ.4కోట్లతో పంపు హౌస్ నిర్మాణం చేపట్టామని తెలిపారు. కార్యక్రమంలో జనసేన నాయకుడు యడ్ల మహేష్, ఎంపీడీవో శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవరావు, వాసిరెడ్డి రాంబాబు, మచ్చేటి శివసత్యప్రసాద్, పండూరి అప్పారావు, ఆళ్ళ ఆనందరావు, పిన్నంటి ఏకబాబు, బత్తిన బ్రదర్స్ పాల్గొన్నారు. ఇదిలా ఉండగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ శస్త్ర చికిత్స చేయించుకుని ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న స్థానిక బోట్ ఆఫీస్ నివాసి గ్రంధి సుజాతకు సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.50 వేలు చెక్కును ఆదివారం గోరంట్ల నివాసంలో ఆమెకు ఎమ్మెల్యే అందజేశారు. యర్రమోతు ధర్మరాజు, పిన్నంటి ఏకబాబు, సావాడ శ్రీనివాస రెడ్డి, వర్రే రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
తొర్రేడులో టీడీపీ కార్యాలయం ప్రారంభం
రాజమహేంద్రవరం రూరల్, జనవరి 17(ఆం ధ్రజ్యోతి): మండలంలోని తొర్రేడు గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం పార్టీ కార్యా లయాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ య్యచౌదరి ప్రారంభించారు. అనంతరం వెంకటనగరం, తొ ర్రేడు గ్రామాల్లో రూ.1.10 కోట్ల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మార్ని వాసుదేవరావు, కొత్తపల్లి సత్యనారాయణ, నున్న కృష్ణ, కురూకూరి కిషోర్, లక్షణ్, గంగిన నాని తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 11:55 PM