వికసిత భారత్ లక్ష్యం కావాలి
ABN, Publish Date - Apr 20 , 2025 | 12:56 AM
వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, నేషన్ ఫస్ట్ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని అభ్యున్నత భారత నిర్మాణంలో విద్యార్థులు, అధ్యాపకులు కలసికట్టుగా పనిచేయాలని అఖిలభారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) జాతీయ సంయుక్త కార్యాచరణ కార్యదర్శి గుంత లక్ష్మణ్ అన్నారు.
ఏబీఆర్‌ఎస్‌ఎం జాతీయ సంయుక్త కార్యాచరణ కార్యదర్శి లక్ష్మణ్
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): వికసిత భారత్ ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని, నేషన్ ఫస్ట్ సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని అభ్యున్నత భారత నిర్మాణంలో విద్యార్థులు, అధ్యాపకులు కలసికట్టుగా పనిచేయాలని అఖిలభారతీయ రాష్ట్రీయ శైక్షిక మహాసంఘ్ (ఏబీఆర్‌ఎస్‌ఎం) జాతీయ సంయుక్త కార్యాచరణ కార్యదర్శి గుంత లక్ష్మణ్ అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో వికసిత భారత్ - 2047 ఉన్నత విద్యాసంస్థల పాత్ర అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో లక్ష్మణ్ మాట్లాడుతూ వికసిత భారత్ ఐదు ముఖ్య లక్ష్యాలను వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ రామచంద్ర ఆర్‌కే మాట్లాడుతూ 1907లో జరిగిన వందేమాతరం ఉద్యమంలో ఆర్ట్స్ కళాశాల పాత్రను గుర్తు చేశారు. ఏబీఆర్‌ఎస్‌ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలసుబ్రహ్మణ్యం, జగ్గంపేట జేడీసీ ప్రిన్సిపాల్ చెన్నారావు, ఐక్యూఏసీ కో ఆర్డినేటర్ అన్నపూర్ణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ పీఆర్ కళాశాల హిందీ లెక్చరర్ పి.హరిరామప్రసాద్ రచించిన, అయోధ్య పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో ప్రచురించబడిన సిద్ధాంత వ్యాసగ్రంథం ‘ఆంధ్ర సంస్కృతి బనాం రామ్ సంస్కృతి’ అనే గ్రంథాన్ని ఆవిష్కరించారు. కామర్స్ అధ్యాపకులు బీపీ నర్సారెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Updated Date - Apr 20 , 2025 | 12:56 AM